ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం ‘పుష్ప’ కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మల్లూవుడ్ లోనూ అల్లు అర్జున్ కు ఓ క్రేజ్ ఉంది. దాంతో ఈ మూడు రాష్ట్రాలలోనూ కోట్లాది మంది అతని సినిమా కోసం ఎదురుచూస్తుంటారు. ఇది సాధారణం. కానీ తాజా సర్వే ప్రకారం బన్నీ మూవీ కోసం ఎదురుచూసే వారి సంఖ్య దేశవ్యాప్తంగా ఉందని తెలిసిది. ఐ.ఎమ్.డీ.బీ. సంస్థ ‘మోస్ట్ యాంటిసిపేటెడ్ న్యూ ఇండియన్ మూవీ’ అంటూ ఆన్ లైన్ లో అభిప్రాయ సేకరణ చేసినప్పుడు స్టైలిష్ స్టార్ ‘పుష్ప’ మూవీ రెండో స్థానంలో నిలిచింది. దీనికి 15.7 శాతం ఓట్లు రాగా, తొలి స్థానంలో నిలిచిన కన్నడ చిత్రం ‘కె.జి.ఎఫ్: చాప్టర్ 2’ 22.01 శాతాన్ని పొందింది.
Read Also : డబ్బింగ్ పూర్తి చేసిన సుధీర్ బాబు
ఇక మూడో స్థానంలో ‘హసీన్ దిల్ రుబా (14.2శాతం), నాలుగో స్థానంలో ‘రాథేశ్యామ్’ (9.3 శాతం), ఐదో స్థానంలో ‘బెల్ బాటమ్’ (7.8 శాతం), ఆరో స్థానంలో ‘తూఫాన్ (7.3 శాతం), ఏడవ స్థానంలో ‘మరక్కర్: లయన్ ఆఫ్ అరేబియన్’ (6.7 శాతం), ఎనిమిదో స్థానంలో ‘అత్రంగి రే’ (6.3శాతం), తొమ్మిదో స్థానంలో ‘గంగూభాయి కతియావాడి’ (6.3శాతం), పదో స్థానంలో ‘ఫీల్స్ లైక్ ఇష్క్’ (6.2) చిత్రాలు నిలిచాయి. మరి ఈ చిత్రాలపై ప్రేక్షకులు పెట్టుకున్న ఆశలకు, అంచనాలకు తగ్గట్టుగా దర్శకనిర్మాతలు వీటిని తెరకెక్కించాలని కోరుకుందాం.
