డబ్బింగ్ పూర్తి చేసిన సుధీర్ బాబు

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. పలాస సినిమాతో విమర్శకుల ప్రసంశలు అందుకున్న కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశారు సుధీర్ బాబు. ఈ విషయాన్నీ తెలియజేస్తూ చిన్న వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు సుధీర్ బాబు. ఆ వీడియో చూస్తుంటే భారీ యాక్షన్ సీన్ కు సుధీర్ బాబు డబ్బింగ్ చెప్పారన్న విషయం అర్థమవుతోంది. ఈ విధంగా ముగిసింది అంటూ సుధీర్ బాబు ఇంటెన్స్ డబ్బింగ్ సెషన్ పూర్తి చేసిన వీడియోను షేర్ చేసుకున్నారు.

Read Also : “బీస్ట్” కోసం బుట్టబొమ్మ డ్యాన్స్ రిహార్సల్స్

ఇక ఈ చిత్రంలో సుధీర్ బాబు ‘సూరిబాబు’ అనే లైటింగ్ బాయ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాను 70ఎమ్.ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా – శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించనున్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ కు, పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

Latest Articles

-Advertisement-