Site icon NTV Telugu

Pushpa 3: ఇక ఇప్పట్లో పుష్ప 3 లేనట్టే?

Pushpa

Pushpa

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప 2’ (ది రూల్) 2024 డిసెంబర్ 5న విడుదలై బెంచ్‌మార్క్ రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా, పుష్ప 3 (ది ర్యాంపేజ్) కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. ‘పుష్ప 2’ రిలీజై ఏడాది పూర్తయినా, మేకర్స్ నుండి ‘పుష్ప 3′ గురించి ఎలాంటి ప్రస్తావన రాకపోవడం చర్చనీయాంశమైంది.’పుష్ప 2’ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా హీరో అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు. “పుష్పని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను” అంటూ బన్నీ పోస్ట్ చేశారు. “అద్భుతమైన విజయం ఇచ్చిన ఆడియన్స్‌కు ఎప్పటికీ రుణపడి వుంటా” అని తెలిపారు. “సుకుమార్‌తో కలిసి వర్క్ చేయడం దక్కిన గౌరవంగా భావిస్తున్నా” అని పేర్కొన్నారు. అయితే, ఈ పోస్ట్‌లో ఎక్కడా ‘పుష్ప 3’ గురించి అల్లు అర్జున్ మాట్లాడలేదు. దర్శకుడు సుకుమార్ సైతం కేవలం ‘పుష్ప 2’ మేకర్స్ పోస్టర్‌ను మాత్రమే షేర్ చేశారు.

Also Read : Akanda 2 :’అఖండ 2’కి అడ్డంకి.. ఆది సాయికుమార్ ‘శంబాల’కు గోల్డెన్ ఛాన్స్?

‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో “బన్నీ కెరీర్‌లో మూడేళ్లు వేస్ట్ చేశా, ఇంకో మూడేళ్లు ఇస్తే పుష్ప 3 తీస్తా” అని సుకుమార్ ఫ్యాన్స్‌కు చెప్పడం, ‘పుష్ప 2’ థ్యాంక్స్ మీట్లో ‘పుష్ప 3’ కథేమిటో నాకు, సుకుమార్‌కు తెలీదు అని అల్లు అర్జున్ చెప్పడం. “అద్భుతంగా వుంటుందనిపిస్తోంది గానీ.. పరిస్థితులు కుదిరే వరకు వెయిట్ చేద్దాం” అని అనడంతో వెంటనే ఆ సినిమా ఉంటుందని అందరూ అనుకున్నారు. ‘పుష్ప 2’ (2024). ‘పుష్ప 1’ (2021) మధ్య మూడేళ్ల గ్యాప్ వచ్చింది. ఈ లెక్కన ‘పుష్ప 3’ (ది ర్యాంపేజ్) ఇప్పట్లో రావడం కష్టమే అని తెలుస్తోంది. దీనికి ప్రస్తుత పరిణామాలు మరింత బలం చేకూరుస్తున్నాయి.

Also Read : Undavalli Arun Kumar: పవన్‌ కల్యాణ్‌ సీఎం అవుతాడని నమ్మా.. ఇలాంటి వ్యాఖ్యలు దురదృష్టకరం..

సుకుమార్ ‘పుష్ప 2’ తర్వాత రామ్ చరణ్‌తో సినిమా చేయనున్నారు. ఏడాది నుంచి ఈ కథ రెడీ అవుతోంది. ఈ సినిమా 2026 సమ్మర్‌లో సెట్స్‌పైకి వెళ్లి, దాదాపు రెండేళ్లపాటు సెట్స్‌పైనే ఉండే అవకాశం ఉంది. బన్నీ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఆయన ఇతర తమిళ దర్శకులు చెబుతున్న కథలు కూడా వింటున్నారు. ఈ పరిస్థితులు చూస్తుంటే, ‘పుష్ప 3’ రాక కోసం అభిమానులు 2028 వరకు ఎదురుచూడాల్సి వస్తుందని నిర్మాత చెప్పిన మాటల్లో నిజం ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే ‘పుష్ప 2’ ఏడాది పూర్తయిన సందర్భంగా అల్లు అర్జున్ కానీ, సుకుమార్ కానీ ‘పుష్ప 3’ గురించి మాట్లాడలేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Exit mobile version