Site icon NTV Telugu

Pushpa 2 Japan Release: టోక్యోలో ‘పుష్ప 2’ ప్రీమియర్ ఈవెంట్.. జపనీస్‌లో డైలాగ్ చెప్పిన అల్లు అర్జున్!

Pushpa

Pushpa

Pushpa 2 Japan Release: జపాన్ రాజధాని టోక్యో నగరంలో నిర్వహించిన ‘పుష్ప 2: ది రూల్’ ప్రీమియర్ ఈవెంట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని అందించాడు. ఈ కార్యక్రమంలో బన్నీ జపనీస్ లాంగ్వేజ్ లో ‘పుష్ప’ డైలాగ్ చెప్పగానే థియేటర్ మొత్తం ఒక్కసారిగా హర్షధ్వానాలు, చప్పట్లతో మారుమోగింది. ఫ్యాన్స్ విజిల్స్‌తో హాల్‌ను ఉర్రూతలూగించారు. కాగా, ఈ ప్రీమియర్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. జపాన్ ప్రేక్షకులు ఇండియన్ సినిమాలను ఎంతగా ఆదరిస్తున్నారో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ముఖ్యంగా మాస్ యాక్షన్, స్టైలిష్ హీరోయిజం మూవీస్ అక్కడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

Read Also: NTR- Neel Dragon Movie: ఇట్స్ అఫీషియల్.. డ్రాగన్ సినీమాలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్

కాగా, ‘పుష్ప 2: ది రూల్’ జపాన్‌లో ఈరోజు (జనవరి 16వ తేదీన) గ్రాండ్‌గా రిలీజ్ కు సిద్ధమవుతుంది. ప్రీమియర్ ఈవెంట్‌కు లభించిన అద్భుత స్పందన మూవీపై భారీగా అంచనాలు పెంచేశాయి. జపాన్‌లో ఈ చిత్రాన్ని ‘పుష్ప కున్రిన్’ పేరుతో రిలీజ్ అవుతుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థల సహకారంతో దాదాపు 250 థియేటర్లలో ఈ మూవీని ప్రదర్శించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక భారతీయ కమర్షియల్ సినిమా ఇంత పెద్ద స్థాయిలో జపాన్‌లో విడుదల కావడం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

Read Also: Victory Venkatesh: మా ఆవిడను అలా పిలిచినందుకు తెగ ఫీలయ్యింది..!

అయితే, సినిమా ప్రమోషన్ల కోసం అల్లు అర్జున్ జపాన్ వెళ్లగా, అతడితో పాటు హీరోయిన్ రష్మిక మందన్న కూడా అక్కడే ఉంది. విమానాశ్రయంలోనే వీరికి అభిమానులు ఘనంగా స్వాగతం పలకడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది ‘పుష్ప’ సిరీస్‌కు ఉన్న అంతర్జాతీయ క్రేజ్‌ను క్లిరియ్ గా చూపిస్తోంది. ఇక, ఇప్పటికే ‘పుష్ప 2: ది రూల్’ భారత్‌తో పాటు విదేశీ మార్కెట్లలో భారీ వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి సుమారు రూ.1800 కోట్లకు పైగా వచ్చినట్లు సమాచారం. అల్లు అర్జున్ యాక్టింగ్, స్టైలిష్ లుక్, పాటలు, మాస్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read Also: Trump-Machado: ట్రంప్‌తో మచాడో భేటీ.. నోబెల్ శాంతి బహుమతి అందజేత

ఇక, ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమాపై దృష్టి పెట్టారు. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీతో చేయబోయే ప్రాజెక్ట్ ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేస్తుంది. ఈ మూవీలో హీరోయిన్‌గా దీపికా పడుకోణె నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ పవర్‌ఫుల్ కాంబినేషన్‌పై ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

Exit mobile version