NTV Telugu Site icon

Pushpa 2 the Rule: హమ్మయ్య మొదలెట్టేశారు!

Pushpa (2)

Pushpa (2)

పుష్ప 2 సినిమాకి సంబంధించిన ఒక షూటింగ్ అప్డేట్ వచ్చేసింది. నవంబర్ 4వ తేదీ నుంచి షూట్ చేయాలనుకున్న స్పెషల్ సాంగ్ ని నవంబర్ ఆరవ తేదీ అంటే ఈరోజు నుంచి మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ లో అల్లు అర్జున్ తో పాటు శ్రీ లీల డాన్స్ చేయనుంది. నిజానికి ఈ సినిమాలో డాన్స్ చేయడం కోసం బాలీవుడ్ తారను తీసుకురావాలనుకున్నారు. ఇటీవల స్త్రీ 2 సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టిన శ్రద్ధా కపూర్ ని ఈ ఐటెం సాంగ్ లో డాన్స్ చేయమని అడిగితే ఆమె డేట్స్ సర్దుబాటు కావని చెప్పడంతో పాటు భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగాను మోసం చేసిన ఇద్దరు స్టార్ హీరోలు?

దాని కంటే లోకల్ లో ఉండే శ్రీ లీల బెటర్ ఆప్షన్ అని ఆమెకు షిఫ్ట్ అయ్యారు. ఇక ఈ రోజు రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన ఒక స్పెషల్ సెట్ లో ఈ సాంగ్ షూటింగ్ మొదలు కాబోతోంది. ఈ సాంగ్ కి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయాల్సి ఉంది. కానీ ఆయన కేసు మీద అరెస్టు అయి జైలుకు వెళ్లి రావడంతో ఈ ఆఫర్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ కి వెళ్ళింది. ఆయన ఈ సినిమా సాంగ్ ని కొరియోగ్రఫీ చేయబోతున్నారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది సినిమా యూనిట్. నవీన్ రవి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ తో పాటు సుకుమార్ కూడా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Show comments