Purusha : రెండు ఓటీటీలలో ‘పురుష:’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్న సినిమాగా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పురుష:’ ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. బత్తుల సరస్వతి సమర్పణలో, ‘కళ్యాణ్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రానికి వీరు వులవల దర్శకత్వం వహించారు. మే 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, థియేటర్లలో విశేష ప్రజాదరణ పొందిన తర్వాత ఇటీవల ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లైన ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియోలలో స్ట్రీమింగ్కు వచ్చింది. ఓటీటీలో విడుదలైన అతితక్కువ సమయంలోనే ‘పురుష:’ మూవీ రెండు ప్రధాన డిజిటల్ వేదికలలోనూ టాప్ ప్లేస్‌లో ట్రెండింగ్ అవుతూ మంచి వ్యూస్‌ను సాధిస్తోంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో కుటుంబ సమేతంగా వీక్షించేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. మహిళా ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన ఈ సినిమాకు ఓటీటీలోనూ ప్రధాన బలంగా మారింది.
ఈ చిత్రంతో హీరోగా పరిచయమైన బత్తుల పవన్ కళ్యాణ్ తన నటనతో మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశారు. సినిమాలో కావాల్సినంత హాస్యం, గుండెలను హత్తుకునే కుటుంబ భావోద్వేగాలు ఉండటంతో కథ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కసిరెడ్డి రాజ్ కుమార్, సప్తగిరి మరియు వెన్నెల కిషోర్ పాత్రలు అందించిన కామెడీ ట్రాక్ ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు తమ అందం, అభినయంతో ఆకట్టుకుని మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.
Also Read
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్‌లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!