Purusha : రెండు ఓటీటీలలో ‘పురుష:’

Purusha Pavan Kalyan Interivew

Purusha Pavan Kalyan Interivew

చిన్న సినిమాగా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘పురుష:’ ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.  బత్తుల సరస్వతి సమర్పణలో, ‘కళ్యాణ్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రానికి వీరు వులవల దర్శకత్వం వహించారు. మే 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, థియేటర్లలో విశేష ప్రజాదరణ పొందిన తర్వాత ఇటీవల ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లైన ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియోలలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఓటీటీలో విడుదలైన అతితక్కువ సమయంలోనే ‘పురుష:’ మూవీ రెండు ప్రధాన డిజిటల్ వేదికలలోనూ టాప్ ప్లేస్‌లో ట్రెండింగ్ అవుతూ మంచి వ్యూస్‌ను సాధిస్తోంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో కుటుంబ సమేతంగా వీక్షించేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. మహిళా ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన ఈ సినిమాకు ఓటీటీలోనూ ప్రధాన బలంగా మారింది.

ఈ చిత్రంతో హీరోగా పరిచయమైన బత్తుల పవన్ కళ్యాణ్ తన నటనతో మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశారు. సినిమాలో కావాల్సినంత హాస్యం, గుండెలను హత్తుకునే కుటుంబ భావోద్వేగాలు ఉండటంతో కథ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కసిరెడ్డి రాజ్ కుమార్, సప్తగిరి మరియు వెన్నెల కిషోర్ పాత్రలు అందించిన కామెడీ ట్రాక్ ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు తమ అందం, అభినయంతో ఆకట్టుకుని మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.