Site icon NTV Telugu

Puri Jagannath : దేశముదురు సినిమాను వదిలేసుకున్న హీరో ఎవరో తెలుసా..?

Puri Jaganndh

Puri Jaganndh

ఒక్కోసారి సూపర్ హిట్ సినెమాలను కొందరు హీరోలు అనుకోని కారణాల వలన వదులుకుంటారు. ఆ తర్వాత అదే కథలు ఇతర హీరోయిలతో అవి సూపర్ హిట్లుగా నిలవడం ఎన్నో సందర్భాలలో చూసాం, రవితేజ చేసిన ఇడియట్ పవన్ కళ్యాణ్ కోసం కథ రెడీ చేసాడు పూరి జగన్నాధ్. రవితేజ భద్ర సినిమాను వదులుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్,అలాగే సింహాద్రి సినిమా బాలయ్యకు అనుకుని ఎన్టీఆర్ తో చేసాడు రాజమౌళి. ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాయి.

Also Read : Swag : శ్వాగ్ సినిమాని ఎవ్వరూ కూడా బాలేదని అనలేదు : శ్రీ విష్ణు

అదే విధంగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా ‘దేశముదురు’. హన్సిక కథానాయకిగా నటించిన ఈ సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్ హిట్. చక్రి సాంగ్స్ ఓ రేంజ్ హిట్. టాలీవుడ్ లో మొదటి సారి సిక్స్ ప్యాక్ పరిచయం అయింది కూడా ఈ సినిమాకే. కానీ ఈ సినిమాకు మొదట అనుకున్న హీరో బన్నీ కాదట. ఈ సినిమా కథను అక్కినేని సుమంత్ కోసం రెడీ చేశారట. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్, పూరి జగన్నాధ్ ఇద్దరు కలిసి వెళ్లి సుమంత్ కు కథ కూడా వినిపించారట. కానీ ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర ఒక సన్యాసి. సన్యాసిని లవ్ చేయడం అదంత కరెక్ట్ కాదని అనిపించి సుమంత్ ఈ సినిమాను రిజెక్ట్ చేసాడట. ఈ విషయం స్వయంగా సుమంత్ ఓ ఇంటర్వ్యూ ల్పో తెలియజేసాడు. అప్పట్లో ఆలా అయిపోయిందని సుమంత్ అన్నాడు. ఆలా తన కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమాను వదులుకున్నాడు అక్కినేని సుమంత్

Exit mobile version