Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’ పనులు షురూ.. మ్యూజికల్ జాతరపై పెరిగిన అంచనాలు!

Slumdog 33 Temple Road

Slumdog 33 Temple Road

టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’. ఈ చిత్రంలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి, సంయుక్తా మీనన్, సీనియర్ నటి టబు, దునియా విజయ్ (సలగా విజయ్) వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. వీరితో పాటు బ్రహ్మాజీ, వీటీవీ గణేష్, విష్ణు రెడ్డి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పూరి కనెక్ట్స్.. జె.బి మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై చార్మీ కౌర్, పూరి జగన్నాథ్, జె.బి. నారాయణరావు కొండ్రోళ్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ తాజాగా పంచుకుంది.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్-ప్రొడక్షన్, రీ-రికార్డింగ్ (RR) పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. పూరి జగన్నాథ్ మార్క్ మేకింగ్‌కు తగ్గట్టుగా అవుట్‌పుట్ పక్కాగా వచ్చేలా టెక్నికల్ టీమ్ రాత్రింబవళ్లు శ్రమిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరికొన్ని సాలిడ్ అప్‌డేట్స్‌ను వరుసగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు రామీ (Ramee) స్వరాలు అందిస్తుండగా.. రీ-రికార్డింగ్ పనులు చాలా అద్భుతంగా వస్తున్నాయని, థియేటర్లలో ఆడియన్స్‌కు పూనకాలు రావడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.