Puri Jagannadh: డబుల్ ఇస్మార్ట్ రిజల్ట్.. పూరీ సంచలన నిర్ణయం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puri Jagannadh assured Niranjan Reddy todo a Movie with him: డైరెక్టర్ పూరీ జగన్నాథ్ లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ సినిమా మీద కూడా అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఒక రకంగా పూరి జగన్నాథ్ కి ఇది మరొక సెట్ బ్యాక్ అని చెప్పాలి. అయితే ఇక్కడ అదృష్టం ఏమిటి అంటే సినిమా రిలీజ్ కి ముందే ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ క్లోజ్ చేశారు. ఓటీటీలో మంచి డీల్ వచ్చింది. అలాగే ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి ఈ సినిమా మొత్తం థియేటర్ హక్కులను 60 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశాడు. అయితే ఆయన ఇప్పుడు భారీగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి నిరంజన్ రెడ్డి హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని భారీగానే డబ్బులు సంపాదించారు. ఆ నమ్మకంతోనే ఆయన మరిన్ని సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు.
Nelson Dilipkumar: 600 కోట్ల బ్లాక్ బస్టర్ సినిమా డైరెక్టర్ కి సినిమా ఛాన్స్ కావలెను
Also Read
- NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
పూరీ జగన్నాథ్ మీద నమ్మకంతో ఆయన తనతో సినిమా చేస్తానని మాటిచ్చిన కారణంగా ఈ సినిమా హక్కులు కొనుగోలు చేశాడు. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమా కొనుగోలు చేసినందుకు నిరంజన్ రెడ్డి దాదాపు 40 కోట్ల రూపాయల వరకు నష్టపోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అంతకుముందు భవిష్యత్తులో చూద్దాం అని పూరి జగన్నాథ్ మాట ఇచ్చినట్టుగా ఇప్పుడు నిరంజన్ రెడ్డి బ్యానర్ లో ఒక సినిమా చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. తేజ సజ్జ హీరోగా పూరి జగన్నాథ్ ఒక సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పూరీ జగన్నాథ్ కి తేజ డేట్స్ ఇస్తాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. నిజానికి తేజ చాలా పర్టిక్యులర్ గా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. చేస్తున్న అన్ని సినిమాలతో హిట్టు కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. హనుమాన్ తరువాత మిరాయ్ అనే సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో మరోసారి పలకరించబోతున్న తేజ పూరి జగన్నాథ్ ప్రాజెక్టు ఓకే చేస్తాడా? అనేది చూడాల్సి ఉంది.
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!