Dubbing Movies : అర్థంకాని టైటిల్స్ పెట్టి నష్టపోతున్న నిర్మాతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవలి కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో పరభాషా చిత్రాల హవా పెరిగింది. ముఖ్యంగా మలయాళ, తమిళ చిత్రాలు తెలుగులోకి క్యూ కడుతున్నాయి. అయితే కంటెంట్ అద్భుతంగా ఉన్నా కేవలం టైటిల్స్ విషయంలో నిర్మాతలు చేస్తున్న పొరపాట్లు ఆ సినిమాల బాక్సాఫీస్ ఫలితాలను దెబ్బతీస్తున్నాయి. అర్థంకాని అరవ, మలయాళ పేర్లతోనే సినిమాలను రిలీజ్ చేయడం వల్ల తెలుగు ప్రేక్షకులు వాటిని తమ సొంత సినిమాలు అనుకోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. టైటిల్ పలకడానికి కష్టంగా ఉన్నా లేదా అసలు అర్థం కాకపోయినా సామాన్య ప్రేక్షకులు ఆ సినిమాపై ఆసక్తి చూపడం లేదు. సినిమా ఎంత బాగున్నా టైటిల్ పరాయి భాషలో ఉండటం వల్ల ఇది మన సినిమా కాదనే భావన ఆడియన్స్‌లో కలుగుతోంది.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ‘తుడరం‘ చిత్రం కేరళలో సుమారు రూ. 230 కోట్లకు పైగా వసూలు చేసి ప్రభంజనం సృష్టించింది. తెలుగులో కూడా ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ టైటిల్ మార్చకుండా అదే పేరుతో రిలీజ్ చేయడం వల్ల ఇక్కడ మోస్తరు వసూళ్లు మాత్రమే రాబట్టింది. అలాగే యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న ‘వాలా 2′ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రం తెలుగులో యువతకు నచ్చినప్పటికీ టైటిల్ కనెక్ట్ కాకపోవడం పెద్ద మైనస్ అయ్యింది. మలయాళంలో రూ. 210 కోట్లు దాటిన ఈ చిత్రం తెలుగులో కేవలం రూ. 4 కోట్ల వద్దే ఆగిపోవడం గమనార్హం. తమిళ హీరో ధనుష్ లేటెస్ట్ సినిమా కర. ఎలాంటి చేంజెస్ చేయకుండా అదే పేరుతో రిలీజ్ చేసారు మేకర్స్. గతంలో పరభాషా చిత్రాలను తెలుగులోకి డబ్ చేసేటప్పుడు ఇక్కడి నేటివిటీకి తగ్గట్టుగా టైటిల్స్ మార్చేవారు. ‘ప్రేమమ్’, ‘కాంతార’ వంటి కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ మెజారిటీ సినిమాలకు తెలుగు పేరు ఉండటమే సేఫ్ అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం డబ్బింగ్ ఖర్చులు తగ్గించుకోవడానికో లేదా బ్రాండ్ నేమ్ కోసమో టైటిల్స్ మార్చకపోతే.. మంచి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద చేతులు కాల్చుకోవాల్సి వస్తుంది.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!