Site icon NTV Telugu

Producer SKN: ఎస్కేఎన్‌ స్పీచ్‌లు చూడడం మానెయ్.. ‘నారీ నారీ నడుమ మురారి’లో ప్రొడ్యూసర్ డైలాగ్ హైలెట్!

Producer Skn

Producer Skn

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా సరే.. చీఫ్ గెస్ట్‌గా నిర్మాత ఎస్కేఎన్‌ ఉండాల్సిందే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. స్టేజ్‌పై అడుగుపెట్టి మైక్ అందుకున్నాడంటే చాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే స్పీచ్ ఇవ్వకుండా స్టేజ్ దిగడనే చెప్పాలి. ఇటీవల పలు సినిమా ఈవెంట్‌లలో ఎస్కేఎన్‌ చేసిన స్పీచ్‌లు విపరీతమైన చర్చకు దారి తీసాయి. యంగ్ ప్రొడ్యూసర్ అయినప్పటికీ తన మాటలతో, స్ట్రెయిట్ ఫార్వర్డ్ అభిప్రాయాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో ఆయన మాటలు వివాదాలకు కూడా దారి తీశాయి. అయితే అదే ఆయనకు మరింత పాపులారిటీని తీసుకొచ్చిందన్నది చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇప్పుడు స్టేజ్‌ల వరకే కాదు.. ఏకంగా సినిమాల్లో కూడా ఎస్కేఎన్‌ పేరు ప్రస్తావించబడుతోంది. తాజాగా విడుదలైన ‘నారి నారి నడుమ మురారి’ సినిమాలో ఎస్కేఎన్‌ను వాడారు. ట్రైలర్‌లో వెన్నెల కిషోర్ చెప్పిన ‘ఎస్కేఎన్‌ స్పీచ్‌లు చూడడం మానేయ్’ అనే డైలాగ్ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇది ఎస్కేఎన్‌ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఓ నిదర్శనం. శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం నారీ నారీ నడుమ మురారి. రామ్‌ అబ్బరాజు తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Samsung Galaxy Z Fold 7 Price Cut: అమెజాన్‌లో క్రేజీ ఆఫర్స్.. గెలాక్సీ జడ్‌ ఫోల్డ్‌ 7పై రూ.62 వేల డిస్కౌంట్!

మరోవైపు నిర్మాతగా కూడా ఎస్కేఎన్‌ తనదైన ముద్ర వేస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమాను అన్ని తానై చూసుకుంటున్నారు. నిర్మాణ బాధ్యతలను పూర్తిగా తన భుజాలపై వేసుకుని ముందుకు నడిపిస్తున్నారు. ఈ యంగ్ ప్రొడ్యూసర్ స్పీచ్‌లతోనే కాదు.. తన పని తీరుతో కూడా టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తున్నారు. మొత్తంగా స్టేజ్‌పై మాటలతో హంగామా సృష్టించడంలోనూ, సినిమాల నిర్మాణంలోనూ ఎస్కేఎన్‌ ఇప్పుడు టాలీవుడ్ నయా ట్రెండ్ సెట్టర్‌గా మారాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Exit mobile version