యాంకర్ నుండి హీరోయిన్‌గా మేకోవరైన కోలీవుడ్ నటి ‘ప్రియ భవానీ శంకర్’. సొంత ఇంట్లో ఫ్రూవ్ చేసుకోగలింది కానీ.. టాలీవుడ్‌లో మాత్రం ఆమెను బ్యాడ్ లక్ వెంటాడుతూనే ఉంది. సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ‘కళ్యాణం కమనీయం’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియా.. ఇక్కడ చేసినవన్నీ ఫ్లాప్సే. 2004లో వచ్చిన భీమా కూడా హిట్ ఇవ్వలేకపోయింది. అయినా కూడా ప్రియ టాలీవుడ్ మరో అవకాశాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్ హీరో ‘రవితేజ’ సరసన నటిస్తున్నట్లు సమాచారం.
Also Read: 200MP కెమెరా, 6500mAh బ్యాటరీ.. ప్రత్యేక ఆకర్షణగా Oppo Reno 15 Pro Mini!
కోలీవుడ్‌లో డీమాంటీ కాలనీ 2, బ్లాక్ చిత్రాల రూపంలో ప్రియ భవానీ శంకర్ ఖాతాలో హిట్స్ పడ్డాయి. అయినా గత ఏడాది ఆమె వెండి తెరపై కనిపించలేదు. ఆ గ్యాప్ నేనివ్వలేదు.. వచ్చింది అంటోంది కోలీవుడ్ భామ. ప్రియ నెక్ట్స్ క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. డీమాంటి కాలనీ 2 బ్లాక్ బస్టర్ కావడంతో పార్ట్ 3 ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దీనితో పాటు ‘హాట్ స్పాట్ 2 మచ్’ అనే మరో సినిమా చేస్తున్నారు. ఇక ‘ఇండియన్ 3’లో ఉన్నప్పటికీ.. ఎప్పుడు ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందో చెప్పలేం. ఇక రవితేజ సరసన ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ ఏడాది ప్రియ మళ్లీ బిజీగా ఉండనున్నారు.
