కాస్తంత ఆలస్యంగా నైనా విశాల్ ‘చక్ర’ ఈ యేడాది ఫిబ్రవరిలో జనం ముందుకు వచ్చింది. కమర్షియల్ గా ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు విశాల్ మరో హీరో ఆర్యతో కలిసి ‘ఎనిమి’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ఫారిన్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. దీనిని తర్వాత విశాల్ ‘అదంగ మరు’ ఫేమ్ కార్తీక్ తంగవేలు దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. ఫైవ్ స్టార్ మూవీస్ సంస్థ నిర్మించే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై నెలాఖరులో మొదలు కానున్నదట. ఇందులో విశాల్ సరసన ప్రియ భవానీ శంకర్ ను నాయికగా ఎన్నుకున్నారని తెలుస్తోంది. టెలివిజన్ ప్రెజెంటర్ గా కెరీర్ ప్రారంభించిన ప్రియ భవానీ ప్రస్తుతం తమిళంలో ఆరేడు సినిమాల్లో నటిస్తోంది. అందులో కొన్ని సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా, మరికొన్ని సెట్స్ పై ఉన్నాయి. ఏదేమైనా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం మీదే విశాల్ కొత్త సినిమా ప్రారంభం ఆధారపడి ఉంటుంది.