Site icon NTV Telugu

RT 77 : రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్

Rt 77

Rt 77

టీవీ ఇండస్ట్రీ నుండి వెండితెరపైకి వచ్చిన ఎంతో మంది ఫ్రూవ్ చేసుకున్నారు, చేసుకుంటున్నారు. వారిలో ఒకరు ప్రియా భవానీ శంకర్. న్యూస్ ప్రజెంటర్ నుండి హీరోయిన్‌గా ఛేంజైన ప్రియా అనతికాలంలోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. సపోర్టింగ్ రోల్స్ చేసుకుంటూ హీరోయిన్‌గా ఎదిగింది. కోలీవుడ్‌లో ఫ్రూవ్ చేసుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్‌లో మాత్రం తడబడింది. ఒకటి కాదు హ్యాట్రిక్ ఫ్లాప్స్ మూటగట్టుకుంది.

Also Read : Ajay Bhupathi : ఘట్టమనేని జయకృష్ణ ఫస్ట్ సినిమా టైటిల్ ఫిక్స్

సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన కళ్యాణం కమనీయంతో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది ప్రియా భవానీ శంకర్. కానీ ఈ సినిమా వచ్చి పోయిన విషయం తెలియదు ఆడియన్స్‌కు. ఆ తర్వాత గోపించద్ భామ, సత్య దేవ్ జీబ్రా సినిమాలో మెరిసింది. ఈరెండు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో టీటౌన్‌లో ఆమె ఊహించినంత క్రేజ్ రాలేదు. కానీ ధూత వెబ్ సిరీస్‌లో నాగ చైతన్య భార్యగా నటించి కాస్తో కూస్తో రిజిస్టరైంది. కోలీవుడ్ ఆఫర్లతో కాలం నెట్టుకొస్తున్న ప్రియాకు టాలీవుడ్ ఓ అవకాశాన్ని ఇచ్చినట్లు లేటెస్ట్ బజ్. శివ నిర్వాణ – రవితేజ కాంబోలో ఓ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో తొలుత సమంత హీరోయిన్ అంటూ వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు కొత్తగా జీబ్రా బ్యూటీకి ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. ఇక గత ఏడాది సక్సెస్ కొట్టిన డీమాంటీ కాలనీ2కి కొనసాగంపుగా వస్తున్న త్రీలో కంటిన్యూ అవుతోన్న ప్రియా.. రవితేజ సినిమాతోనైనా తెలుగు ఇండస్ట్రీలో క్రేజ్ తెచ్చుకుంటుందేమో లెట్స్ సీ.

Exit mobile version