Khalifa Trailer: ‘ఖలీఫా’ ట్రైలర్ ఔట్.. బంగారం, స్మగ్లింగ్, ప్రతీకారంతో పృథ్వీరాజ్ మాస్ వార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khalifa Trailer: ఒక స్మగ్లర్ వారసత్వం, కోట్ల విలువైన బంగారం, రాజకీయ కుట్రలు, చివరికి రక్తపాత ప్రతీకారం. ఈ నాలుగు అంశాల చుట్టూ తిరిగే భారీ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్‌గా ‘ఖలీఫా’ (Khalifa) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దర్శకుడు వైశాఖ్ తెరకెక్కించిన ఈ మూవీ ట్రైలర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ పవర్ఫుల్ లుక్, ఇంటెన్స్ డైలాగ్స్, హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ భారీ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఖలీఫా’ (Khalifa) ట్రైలర్ ను నిన్న రాత్రి (ఆగస్టు 16) 8:30 గంటలకు ఆఫీషియల్ గా రిలీజ్ చేశారు మేకర్స్. వైశాఖ్ దర్శకత్వంలో జిను వి. అబ్రహం కథ అందించిన ఈ భారీ బడ్జెట్ సినిమాలో పృథ్వీరాజ్ ‘మాంబరక్కల్ ఆమిర్ అలీ’ అనే పవర్ఫుల్ గోల్డ్ స్మగ్లింగ్ డాన్ పాత్రలో గగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్సెస్, డైలాగ్స్‌తో అదరగొట్టారు. ఈ హై-వోల్టేజ్ ట్రైలర్ విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్‌తో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సరసన మాలవిక శర్మ హీరోయిన్గా నటిస్తుండగా, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ‘మాంబరక్కల్ అహ్మద్ అలీ’ అనే అత్యంత పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుండటం ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ మూవీ ఓనమ్ (Onam) పండుగ కానుకగా ఈ వారంలోనే అంటే 2026 ఆగస్టు 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల కానుంది. పృథ్వీరాజ్ గతంలో విడుదల చేసిన ఆమిర్ అలీ చిన్ననాటి లుక్, గ్లింప్స్ ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. ఇప్పుడు ట్రైలర్ కూడా అదే ఉత్సాహాన్ని రెట్టింపు చేయడంతో, ఓణం సందర్భంగా ఖలీఫా బాక్సాఫీస్ వద్ద ఎంతటి ప్రభావం చూపిస్తుందో చూడాలనే ఆసక్తి మరింత పెరిగింది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!