NTV Telugu Site icon

SSMB 29 : పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా సెట్స్ మీదకు!!

Prithviraj Sukumaran Salaar 2

Prithviraj Sukumaran Salaar 2

ఎస్ఎస్ రాజమౌళి, మహేష్‌ బాబు సినిమా నుంచి ఎప్పుడు ఎలాంటి అప్ డేట్ వస్తుందో చెప్పడం కష్టంగా మారింది. ఈ సినిమా గురించి ఎప్పుడు ఎప్పుడు ఎలాంటి అప్డేట్ బయటకు వస్తుందో అని అభిమానులు ఎదురు చూడడం కామన్ అయిపోతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ఒక షెడ్యూల్ హైదరాబాదు అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్ లో జరిగింది. ఆ షూట్ నుచి సింగిల్ పిక్ కూడా బయటకయు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రాల మీద షూట్ చేసిన ఈ షెడ్యూల్ పూర్తి కాగా ఇప్పుడు టీం ఒడిశా వెళ్లి అక్కడ షూటింగ్ కి రెడీ అవుతోంది.

Yellamma: బుజ్జి తల్లి కోసం ఎల్లమ్మ ఎదురుచూపులు?

ఆ షెడ్యూల్ లో ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా జాయిన్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఎస్ఎస్‌ఎంబీ 29 ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోతుందని ప్రచారమే తప్ప జక్కన్న ఎలాంటి వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మేకర్స్ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు? అనేది చెప్పడం మాత్రం కష్టం.