నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కల్యాణ్ రామ్ తల్లిగా, పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఇక రీసెంట్‌గా ఈ మూవీ నుండి విడుదలైన టీజర్ ఎంతో ఎమోషనల్‌గా ఆకటుకుంది. ఓల్డ్ మూవీ ‘కర్తవ్యం’లో విజయశాంతిగా చేసిన వైజయంతి పాత్రకు, కొడుకు ఉంటే ఎలా ఉంటుందనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో, ఈ కథను డెవలప్ చేసినట్టు మెకర్స్ తెలుపారు. ఇక హై ఓల్టేజ్ యాక్షన్ కమ్, ఎమోషనల్ మూవీగా రూపొందిన ఈ సినిమాలో సీనియర్ తెలుగు నటుడు బబ్లూ పృథ్వీ కీలక పాత్ర పోషించారు. ఈ మూవీలో పృథ్వీ పోలీస్ అధికారిగా అలరించనున్నారు. అయితే తాజాగా టీజర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన పృథ్వీ తన కెరీర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు..
Also Read: Janhvi Kapoor : ఆ ప్రమాధం నా జీవితంలో మర్చిపోను..
‘ గత 50 సంవత్సరాలుగా నేను ఇండస్ట్రీలో ఉన్నాను. ఎన్నో కష్టాలు పడ్డాను.. ఎన్నో ఎత్తు పల్లాలను చూశాను. కానీ ఇప్పుడు నా టైమ్ మారింపొయింది. సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ సినిమాలో ఏమంటూ ఛాన్స్ ఇచ్చాడో.. అది నా జీవితాన్ని మార్చేసింది. ఇప్పటి వరకు నా కెరీర్లో 250 నుంచి 300 వరకు సినిమాలు చేశాను, అందులో ఎన్నో రకల పాత్రలు పోషించాను, వాటన్నింటిలో నేను చేసిన అత్యంత కష్టమైన పాత్ర ఈ సినిమాలోనే చేశాను. ఈ మూవీతో నాకు చాలా గుర్తింపు వచ్చింది. వరుస అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇందుకు గాను నేను సందీప్‌కి ఎప్పటికి రుణపడి ఉంటాను. అలా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ లో కూడా నా పాత్ర చాలా కీలకం. ఈ చిత్రం ప్రతి ఒక్కరి మనసును హత్తుకుంటుంది’ అని పృథ్వీ తెలిపారు.