NTV Telugu Site icon

Gopichand: గోపిచంద్, శ్రీనువైట్ల హిట్ కొడతారంటారా..?

Untitled Design (21)

Untitled Design (21)

ఒకప్పటి స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల, మాచో స్టార్ గోపీచంద్ కాంబోలో వస్తోన్న చిత్రం ‘విశ్వం’. టాలీవుడ్ లో వరుస సినిమాలు నిమిస్తోన్న
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఏ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. డబుల్ ఇస్మార్ట్ భామ కావ్య థాపర్ గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఆల్రెడీ గతంలోనే విశ్వం సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసారు.

తాజాగా జర్నీ ఆఫ్ విశ్వం పేరుతో విశ్వం సినిమా మేకింగ్ వీడియోని రిలీజ్ చేసారు మేకర్స్. షూటింగ్‌కు సంబంధించిన సీన్స్‌తో పాటు ఇటలీలో షూట్ చేసిన హై యాక్షన్ సీక్వెన్స్ లను ఎక్కువగా చూపించారు. శ్రీను వైట్లకి మార్క్ కామెడీ అయినటువంటి ట్రైన్ కామెడీ ఈ సినిమాకు కీలకంగా ఉండనున్నట్టు మేకింగ్ వీడియో చుస్తే అర్ధం అవుతుంది. మరి ఈ సినిమా ట్రైన్ కామెడీ కూడా వెంకీ సినిమాలోని కామెడీని తలపిస్తుందేమో చూడాలి. టాలివుడ్ అగ్ర నటులు, హాస్యనటులను ట్రైన్ సీన్ లో చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు శ్రీను వైట్ల. ఈ చిత్రంలోని మేజర్ భాగం ఇటలీలో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెలుసుకువస్తున్నామని చివర్లో ప్రకటించాడు దర్శకుడు.

ఆగడుతో మొదలైన దర్శకుడు శ్రీనువైట్ల పరాజయాలా పరంపర ఇప్పటికి ఆగలేదు. లక్ష్యం తర్వాత హిట్ కొట్టలేదు గోపీచంద్. వీరి కలయికలో వస్తోన్న విశ్వం సూపర్ హిట్ కొడతారని యూనిట్ ద్వారా సమాచారం తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో రానున్న ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.

Also Read: Bollywood: ఇండియన్ స్క్రీన్ పై మరోసారి ‘రామాయణం’.. రాముడు ఎవరంటె.?

 

Show comments