Akhanda2 Thaandavam : మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్.. ఇప్పటికి ఓపెన్ కానీ నైజాం బుకింగ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరక్కేక్కిన చిత్రం ‘అఖండ-2′. 14 రీల్స్ ప్లస్ బ్యానేర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఈ రోజు రాత్రి 9.30 గంటల ప్రీమియర్ షోస్ తో రిలీజ్ కు రెడీ అయింది. అందుకు సంబంధించి బుకింగ్స్ ఓపెన్ చేయగా సాలిడ్ టికెట్స్ సెల్లింగ్స్ తో దూసుకెళ్తోంది. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, ముంబై, ఢిల్లీ రాష్ట్రాలలో బుకింగ్స్ ఓపెన్ చేశారు.
కానీ ఈ సినిమాకు సంబందించి నైజాం ప్రాంతం బుకింగ్స్ విషయంలో మాత్రం తర్జన భర్జనలు జరిగుతున్నాయి. వాస్తవానికీ నిన్న సాయంత్రం 6 గంటలకు నైజాం ప్రీమియర్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. కానీ ఓపెన్ చేయలేదు. ఈ విషయమై ఆరా తీయగా తెలంగాణ వ్యాప్తంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. కానీ అనుమతుల విషయంలో కాస్త జాప్యం జరుగుతోందని సమాచారం. అయితే ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకు కూడా ఇలాగే అనుమతులు ఇచ్చారు. కానీ తర్వాత కొందరు కోర్టులో కేసులు వేయడంతో నిర్మాతలకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో గందరగోళం నెలకొంది. ఇప్పుడు రాబోతున్న అఖండ 2కు అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా జీవో ఇచ్చేలా కార్యచరణ చేస్తున్నారు. కానీ ప్రీమియర్స్ కు మరికొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి. ఇంకా బుకింగ్స్ ఓపెన్ చేయకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభావం అఖండ 2 మొదటి రోజు వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
Also Read
తాజావార్తలు
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
-
Ketan Agarwal case: కేతన్‌ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
-
Delhi Court: ఆ టైమ్‌లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!