Site icon NTV Telugu

Preity Mukhundhan: కన్నప్ప సైడ్ చేస్తే.. ప్రీతి మొదలెట్టింది!

Preity Mukundhan

Preity Mukundhan

తెలుగులో ఓం భీమ్ బుష్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రీతి ముకుందన్ తర్వాత పెద్దగా సినిమాలు సైన్ చేయలేదు. ఆమె ‘కన్నప్ప’ నెమలి అనే పాత్ర మీద చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని, తనకు చాలా ప్లస్ అవుతుందని ఆమె భావించింది.

Also Read:Lokesh Kanagaraj: అందుకే పూజా హెగ్డే’కి ఆ పేరు!

నిజానికి ఈ సినిమాలో పర్ఫామెన్స్‌తో పాటు గ్లామర్ విషయంలో కూడా ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. నిజానికి చాలా మంచి పాత్ర ఆమెకి పడింది. అయితే సినిమా టీం ఏమనుకుందో ఏమో తెలియదు కానీ ఆమెను పక్కన పెట్టేసింది. ఆమె సినిమా ప్రమోషన్స్ విషయంలో పాల్గొనాలని అనుకుందో ఏమో తెలియదు గానీ టీం మాత్రం ఆమెను ఇన్వాల్వ్ అవ్వనీయలేదు.

Also Read:8 vasanthalu: థియేటర్లో దేఖలేదు.. ఇప్పుడేమో తెగ లేపుతున్నారు!

ఇప్పుడు పూర్తిగా కన్నప్ప థియేటర్ రన్ పూర్తయింది. బాక్సాఫీస్ అంచనాలను అందుకోలేకపోయింది. త్వరలో ఓటీటీ రిలీజ్ కూడా ఉండే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు సైలెంట్ అవ్వకుండా ప్రీతి ముకుందన్ ఒక ఆసక్తికరమైన స్ట్రాటజీ ఫాలో అవుతోంది. ఆమె తనకు తాను సెల్ఫ్ ప్రమోషన్ మొదలుపెట్టింది. సోషల్ మీడియాలో ఇంటర్వ్యూస్ ఇస్తూ సినిమా షూటింగ్ టైం‌లో తన అనుభవాలను, ముఖ్యంగా ప్రభాస్‌తో తన నటన, ఆయనతో స్పెండ్ చేసిన టైం గురించి చెబుతోంది. తాజాగా ఆమె ప్రమోషన్స్‌లో మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే కచ్చితంగా టీం‌తో ఆమెకు ఏదో డిఫరెన్స్‌ల వచ్చాయని అనుమానాలు రేకెత్తించేలా ఉంది.

Exit mobile version