Preity Mukhundhan: “హీరోయిన్లను గ్లామర్‌కే వాడుకుంటున్నారు”.. ప్రీతి ముకుందన్ బోల్డ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ మరియు టాలీవుడ్లో వరుస క్రేజీ ప్రాజెక్టులతో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్గా దూసుకుపోతున్నారు యంగ్ అండ్ బ్యూటిఫుల్ నటి ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). ఇటీవల సూర్య సరసన నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘కరుప్పు’ (Karuppu) లో లాయర్ ప్రీతిగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి భారీ క్రేజ్ సొంతం చేసుకున్నారామె. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రీతి.. చిత్ర పరిశ్రమలో హీరోయిన్ క్యారెక్టర్ల రైటింగ్స్, సినిమాల్లో మహిళా పాత్రలకు ఇచ్చే ప్రాధాన్యతపై చాలా ఓపెన్‌గా, బోల్డ్‌గా మాట్లాడారు. అలాగే తన అప్‌కమింగ్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్లాస్ట్’ (#Blast).. రీసెంట్ ఓటీటీ ప్రాజెక్ట్ ‘సర్వం మాయ’ (#SarvamMaya) ల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో కేవలం గ్లామర్ కోసమే హీరోయిన్లను వాడుకుంటున్నారనే విమర్శలపై ప్రీతి ముకుందన్ చాలా ప్రాక్టికల్‌గా స్పందించారు.. ‘‘నేను ప్రస్తుతం వింటున్న చాలా స్క్రిప్ట్‌లలో కొన్ని క్యారెక్టర్లకు అసలు ఎలాంటి ఇంపాక్ట్ (ప్రభావం) ఉండటం లేదు. నేను కొంతమంది దర్శకులను నేరుగా ‘అసలు ఈ పాత్రను ఇలా ఎందుకు అనుకున్నారు?’ అని ప్రశ్నించాను కూడా. కానీ వారి దగ్గర ఎలాంటి సమాధానం ఉండదు. చిత్ర పరిశ్రమలో మహిళా పాత్రలకు కేవలం ఒక నిర్దిష్ట స్థాయి ప్రాధాన్యత మాత్రమే ఇస్తున్నారు. నటీమణుల కోసం పాత్రలు రాసేటప్పుడు వారు చాలా పరిమితులు పెట్టుకుంటున్నారు. మరి కొన్ని సినిమాల్లో ఒక క్యారెక్టర్ సినిమా మొత్తం ట్రావెల్ అవుతుంది.. కానీ ఆ పాత్ర వల్ల కథకు ఎలాంటి ఉపయోగం ఉండదు. కానీ మరికొన్ని పాత్రలు స్క్రీన్ మీద కనిపించేది తక్కువ సమయమే అయినా.. ప్రేక్షకుడి మనసుపై బలమైన ఇంపాక్ట్ చూపిస్తాయి. నేను అలాంటి పాత్రలకే ప్రాధాన్యత ఇస్తాను. ఇప్పుడు నా రాబోయే చిత్రం ‘బ్లాస్ట్’ (#Blast) లో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మహిళా పాత్రలకు ప్రాపర్ ఇంటెన్షనల్ బిల్డప్ (సరైన ప్రాధాన్యత) ఇచ్చారు. ఇందులో ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ శారీరకంగా చాలా దృఢంగా, పవర్‌ఫుల్‌గా ఉంటుంది. సినిమాలో నాకు చాలా యాక్షన్ సీక్వెన్సులు ఉన్నాయి’ అని ప్రీతి ముకుందన్ వెల్లడించారు.
Also Read
ఇటీవలే విడుదలైన వెబ్ సిరీస్ ‘సర్వం మాయ’ (#SarvamMaya) లో తన పాత్ర గురించి చెప్తూ.. ‘నిజానికి నేను మొదట ఈ ప్రాజెక్ట్‌లో ‘దెలేలు’ (Delelu) క్యారెక్టర్ చేయాల్సింది. కానీ చివరి నిమిషంలో స్క్రిప్ట్ మారడంతో నా క్యారెక్టర్ కూడా మారిపోయింది. అయినప్పటికీ ఆ చిత్ర యూనిట్, మేకర్స్ చాలా లవ్లీ పీపుల్. వారితో కలిసి పని చేయడం మంచి అనుభూతిని ఇచ్చింది, అందుకే ఆ పాత్ర మార్చినా నేను సినిమా పూర్తి చేశాను’ అని ప్రీతి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?