Site icon NTV Telugu

NTRNeel : అర్థంతరంగా డ్రాగన్ షూట్ ను ఆపేసిన ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ బ్యాక్ టు హైదరాబాద్

Ntrneel

Ntrneel

నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే ఈ చిత్రం కోసం చిత్ర యూనిట్ జోర్డాన్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ అత్యంత కీలకమైన, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించారు. అయితే  ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం జోర్డాన్ లో మార్చి6వరకు షూటింగ్ జరగాల్సి ఉంది. కానీ అనూహ్యంగా ఈ షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. షెడ్యూల్ ప్రకారం జోర్డాన్‌లో చిత్రీకరించాల్సిన ప్రధాన యాక్షన్ సీక్వెన్స్‌లన్నీ ప్లాన్ చేసినట్లే పూర్తి చేశారట. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ ఘట్టాలతో ఎన్టీఆర్ దుమ్మురేపినట్లు సమాచారం. అయితే, ఈ సీక్వెన్స్‌లకు సంబంధించిన కొన్ని ‘లింక్ సీన్స్’ (కనెక్టింగ్ సీన్స్) చిత్రీకరణలో మాత్రం చిన్నపాటి అడ్డంకులు ఎదురయ్యాయి.

Also Read : 70thFilmfareAwardsSouth : ఫిలిం ఫేర్ అవార్డ్స్ విజేతల లిస్ట్..

జోర్డాన్‌లో స్థానికంగా జూనియర్ ఆర్టిస్టుల సరిగా లేకపోవడం మరియు కొన్ని లాజిస్టిక్ ఇష్యూస్ తలెత్తడంతో, మేకర్స్ తమ ప్లాన్ మార్చుకున్నారు. ఆ లింక్ సీన్ల కోసం అక్కడే వేచి ఉండటం కంటే జోర్డాన్‌లో మిగిలిపోయిన ఆ చిన్నపాటి సీన్లను రామోజీ ఫిల్మ్ సిటీలో లేదా హైదరాబాద్ పరిసరాల్లో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో పూర్తి చేయనున్నారు. అందుకె అనుకున్న డేట్ కంటే ముందుగానే అనగా ఈ నెల 25న డ్రాగన్ యూనిట్ హైదరాబాద్ వచ్చేస్తోంది.  షూటింగ్‌లో ఇలాంటి చిన్న చిన్న మార్పులు సహజమే అయినప్పటికీ, సినిమా అవుట్‌పుట్ విషయంలో ప్రశాంత్ నీల్ ఎక్కడా రాజీ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జోర్డాన్ లో షూట్ చేసిన సీన్స్ హైలెట్ గా ఉంటాయని నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రేంజ్ లో యాక్షన్ బ్లాక్స్ ఉంటయని టీమ్ నుండి అందుతున్న సమాచారం.

Exit mobile version