NTV Telugu Site icon

Prashant Varma : సినిమాలు తీసి మీ డబ్బును వృధా చేసుకుంటారు ఎందుకు

Ashok Galla

Ashok Galla

తొలి సినిమా ‘హీరో’తో ఆకట్టుకున్న యంగ్ హీరో అశోక్ గల్లా తన సెకెండ్ మూవీ ‘దేవకీ నందన వాసుదేవ’తో వస్తున్నారు.   అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో, లలితాంబిక ప్రొడక్షన్స్ పతాకంపై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. తాజగా ఈ  చిత్ర ట్రైలర్ లాంఛ్ వేడుకలో  ఈ సినిమాకు కథ అందించిన స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కీలక వ్యాఖ్యలు చేసారు

Also Read : Actress Kasturi : ముందస్తు బెయిల్ కోరిన పరారీలో ఉన్న నటి కస్తూరి

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ప్రతి కథ మీద హీరో పేరు రాసి ఉంటుంది. ఈ కథపై అశోక్ పేరు రాసి ఉంది. సినిమా చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. మేమేదైతే అనుకున్నామో అర్జున్ గారు ఇంకా బాగా డెవలప్ చేసి చాలా అద్భుతంగా చూపించారు, నిర్మాత బాల  నాకు బాగా కావాల్సిన వారు. అయన ఇండస్ట్రీలోకి వస్తాను అంటే ఎందుకు అండి వద్దు, సినిమా ఇండస్ట్రీ వద్దు, కస్టపడి సంపాదించారు. ఇటు రాకండి. మీ డబ్బును వృధా చేసుకోకండి సినీ చెప్పను. కానీ చాలా మంచి సినిమా చేయాలని చాలా వెయిట్ చేసి ఈ సినిమాని చాలా అద్భుతంగా నిర్మించారు. సినిమా చూశాను చాలా అద్భుతంగా ఉంది. అశోక్, మానస అందరూ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు.  మంచి ఫ్యామిలీ ఫిలం. లవ్ స్టోరీ, యాక్షన్, ఎమోషన్స్ అన్ని ఉన్నాయి. ట్రైలర్లో ఏదైతే ఎనర్జీ చూసారో సినిమా లో ఆ ఎనర్జీ ఉంటుంది. అశోక్ ఈ సినిమాతో మరో మెట్టు పైకెక్కాలని కోరుకుంటున్నాను. అర్జున్ గారు ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాలని, పెద్ద యాక్టర్స్ తో పనిచేయాలని కోరుకుంటున్నాను. యంగ్ టీం ని ఎంకరేజ్ చేయండి. అందరూ కష్టపడి పని చేశారు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

Show comments