Nagarjuna: నాగార్జునకు బర్త్‌డే విషెస్ చెప్పబోయి అడ్డంగా బుక్కైన ప్రగ్యా జైస్వాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో సెలబ్రిటీలు చేసే చిన్న చిన్న పొరపాట్లు కొన్నిసార్లు నెట్టింట పెద్ద దుమారాన్నే రేపుతుంటాయి. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. కింగ్ అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె పెట్టిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ నెటిజన్లను విస్మయానికి గురిచేయడమే కాకుండా, పెద్ద ఎత్తున మీమ్స్‌కు దారితీసింది. నాగార్జున బర్త్‌డే సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. ఈ క్రమంలోనే హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నాగార్జున ఫోటోను షేర్ చేస్తూ.. “హ్యాపీ బర్త్‌డే నాగార్జున గారు.. మీ ఎనర్జీ, ఛార్మ్ అద్భుతం” అంటూ మనస్ఫూర్తిగా విషెస్ రాసుకొచ్చింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆ పోస్ట్‌కు బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక మంచి సాంగ్‌ను యాడ్ చేయాలనుకున్న ఆమె.. ఇన్స్టాగ్రామ్ మ్యూజిక్ లైబ్రరీలో సెర్చ్ చేసి ‘Nagarjuna x Nana Garu Drum’ అనే వైరల్ ఆడియోను సెలెక్ట్ చేసింది. ఆ ఆడియో క్లిప్‌లో అసభ్యకరమైన పదజాలం ఉన్నాయన్న విషయాన్ని ఆమె కానీ, ఆమె సోషల్ మీడియా టీమ్ కానీ గమనించలేదు. నాగార్జున పేరు కనిపించగానే ఏమాత్రం వినకుండా, చెక్ చేసుకోకుండా ఆ పాటను స్టోరీకి జోడించి పోస్ట్ చేసేశారు.
సీనియర్ స్టార్ హీరోకు శుభాకాంక్షలు చెప్పే పోస్ట్‌లో అలాంటి అసభ్యకరమైన ఆడియో రావడంతో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. క్షణాల్లో ఈ స్టోరీ స్క్రీన్షాట్లు, స్క్రీన్ రికార్డింగ్‌లు వైరల్‌గా మారాయి. విషయం తెలుసుకున్న ప్రగ్యా జైస్వాల్ వెంటనే ఆ స్టోరీని డిలీట్ చేసి, ఆడియో లేకుండా కేవలం ఫోటో, టెక్స్ట్‌తో కొత్త స్టోరీని రీ-పోస్ట్ చేసింది. ఈ తప్పిదంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్‌కు తెలుగు భాషపై సరైన పట్టు లేకపోవడం వల్లే ఆ పాటలోని పదాలను అర్థం చేసుకోలేకపోయిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. సెలబ్రిటీల అకౌంట్లను మెయింటైన్ చేసే డిజిటల్ లేదా పీఆర్ (PR) టీమ్‌ల అత్యుత్సాహం, నిర్లక్ష్యం వల్లే ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయని మరికొందరు మండిపడుతున్నారు. కనీసం పోస్ట్ చేసే ముందైనా ఆడియోను ఒకసారి వినకపోవడం ఎంతవరకు సమంజసమని సినీ ప్రియులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సున్నితమైన విషయాల్లో ఇతర భాషల నటీనటులు లేదా వారి సోషల్ మీడియా టీమ్‌లు మరింత బాధ్యతగా, జాగ్రత్తగా వ్యవహరించకపోతే అనవసరమైన ట్రోలింగ్‌కు గురికావాల్సి వస్తుందనడానికి ఈ ఘటనే తాజా ఉదాహరణ.
Also Read
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-9 Live : నేడు మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కల్యాణం.. తొమ్మిదో రోజు వేడుకలివే..!
-
Nitin Nabin: రాహుల్ గాంధీతో చర్చకు బీజేపీ మండలాధ్యక్షుడు చాలు..
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Hyderabad News : హైదరాబాద్ ఉగ్రదాడి బెదిరింపు మెయిల్ ఫేక్.. నిర్ధారించిన పోలీసులు
-
Ramayana : ఒక్క అడుగు దూరంలో రామాయణ
-
YS Sharmila : బెంగళూరులో హైడ్రామా.. యలహంక ఇంటికి వెళ్లేందుకు షర్మిల, విజయమ్మ ప్రయత్నం
ట్రెండింగ్
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్‌లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..