టాలీవుడ్ మరియు కోలీవుడ్ ప్రేక్షకులను తన యూత్‌ఫుల్ ఎనర్జీతో ఆకట్టుకుంటున్న యంగ్ స్టార్ ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు స్ట్రయిట్ తెలుగు సినిమా చేయబోతున్నాడు. వైవిధ్యమైన కథలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇంటెలిజెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ప్రదీప్ ఒక భారీ యాక్షన్ థ్రిల్లర్‌లో నటించనున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది.
Also Read : Release Postpone : ఏప్రిల్ వాయిదా పడ్డ మరో ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు
గతంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చిన ‘డ్యూడ్’ చిత్రంతో ప్రదీప్ రంగనాథన్ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా దాదాపు రూ. 114 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ప్రదీప్ క్రేజ్‌ను అమాంతం పెంచేసింది. ఇప్పుడు మరోసారి అదే బ్యానర్లో సినిమా చేస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగాయి. ప్రదీప్ మార్క్ కామెడీ, ఎనర్జీకి.. చంద్రశేఖర్ యేలేటి మార్క్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తోడైతే సినిమా సరికొత్తగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఫిలిం నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రదీప్ రంగనాథన్ ఏకంగా రూ. 50 కోట్ల భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. కేవలం ఏడేళ్ల వ్యవధిలో రూ. 50 లక్షల స్థాయి నుండి రూ. 50 కోట్ల వరకు చేరుకోవడం ప్రదీప్ సాధించిన సక్సెస్‌గా చెప్పుకోవచ్చు. తెలుగు, తమిళ మార్కెట్లలో ఆయనకున్న పట్టును దృష్టిలో ఉంచుకుని మేకర్స్ కూడా ఈ భారీ మొత్తానికి ఓకే చెప్పినట్లు టాక్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నాయి. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. త్వరలోనే దీనిపై మైత్రీ మూవీ మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడనుంది. ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన ‘LIC’ విడుదల కోసం సిద్ధంగా ఉన్నాడు.