NTV Telugu Site icon

Pradeep Ranganathan: హీరోగా నన్ను చాలా మంది హీరోయిన్స్ రిజెక్ట్ చేశారు..

February 7 (85)

February 7 (85)

టాలెంటెడ్ హీరో కంమ్ దర్శకుడు ప్రదీప్ రంగనాధన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. యూత్‌లో ఆయనకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ‘లవ్ టుడే’ మూవీతో తిరుగులేని ఫేమ్ సంపాదించుకున్నాడు. తెలుగులో కూడా అతనికి చాలా మంచి మార్కెట్ ఏర్పడింది. ప్రస్తుతం యువత ఎలాంటి పరిస్థితిలో ఉందో ఈ మూవీలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇక ప్రజంట్ ప్రదీప్ ‘డ్రాగన్’, ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలకు హీరోగా, రచయితగా పనిచేస్తున్నాడు ప్రదీప్. అయితే తాజాగా చెన్నైలో జరిగిన ‘డ్రాగన్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ల్లో పాల్గొన్న ప్రదీప్ తన కెరీర్ స్టార్టింగ్లో సినీరంగంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నాడు.

Also Read:Nag Ashwin :బాలీవుడ్ బ్యూటీ తో నాగ్ అశ్విన్ మూవీ..?

ప్రదీప్ మాట్లాడుతూ.. ‘నన్ను తొక్కేయాలని అని చాలా మంది ప్రయత్నిస్తున్నారు.. అంతా చూస్తూనే ఉన్నాను. కానీ నేను పెరుగుతున్న మొక్కను. మొక్క పెరగడానికి చాలా కష్టపడుతుంది. నేను కూడా అలాగే సవాల్లు స్వీకరిస్తూ మరింత బలంగా ఎదుగుతాను. నేను హీరోగా నటించిన ఫస్ట్ మూవీ ‘లవ్ టుడే’ విషయానికి వస్తే.. ఈ సినిమాకు హీరోయిన్ దొరకడం చాలా కష్టమైంది. ఎందుకంటే నేను హీరో అనగానే చాలా మంది హీరోయిన్స్ రిజెక్ట్ చేశారు. నాతో నటించేందుకు చాలా మంది హీరోయిన్స్ ఆలోచించారు. ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకున్నారు. మరికొందరేమో నిజాయితీగా నా పక్కన చేయనని.. పెద్ద స్టార్లతో మాత్రమే నటిస్తామని చెప్పారు. వారి నిజాయితీకి థాంక్స్. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. రిజెక్ట్ చేసిన వారందరికీ అదే మూవీ హిట్ తో నను నేను నిరూపించుకున్నాను’ అని అన్నాడు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.