Vikatakavi: ఉత్తమ దర్శకుడిగా ప్రదీప్ మద్దాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలో హిందూస్తాన్ టైమ్స్ ఓ టి టి ప్లే అవార్డ్స్ 2025 మూడవ ఎడిషన్ ఘనంగా జరిగింది. “వన్ నేషన్, వన్ అవార్డు” అనే థీమ్ తో ఓ టి టి లో అత్యుత్తమ కంటెంట్ ను ప్రోత్సహిస్తూ, ప్రీమియర్ పాన్ ఇండియా ఓటిటి ఈవెంట్ గా పేరు తెచ్చుకుంది. అపరశక్తి ఖురానా , కుబ్రా సైత్ వ్యాఖ్యాతలు గా వ్యవహరించిన ఈ స్టార్-స్టడెడ్ ఈవెంట్ లో, దేశంలోని విభిన్న చలనచిత్ర పరిశ్రమల నుండి ప్రతిభావంతులు పాలుపంచుకున్నారు. ఓ తో టి స్పేస్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులను తన ప్రఖ్యాత అవార్డులతో సత్కరించింది. ‘డిస్పాచ్’ కోసం ఉత్తమ నటుడు గా మనోజ్ బాజ్‌పాయ్, ‘భామ కలాపం 2’ కోసం ఉత్తమ నటిగా ప్రియ మణి మరియు ‘ది రాణా దగ్గుబాటి షో’ కోసం ఉత్తమ టాక్ షో హోస్ట్‌గా రానా దగ్గుబాటితో సహా అనేక మంది ప్రముఖ వ్యక్తులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మనోజ్ బాజ్‌పేయి మరియు ప్రియమణి నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3’ గురించి కూడా విషయాలు పంచుకున్నారు.
ఉత్తమ దర్శకుడిగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రదీప్ మద్దలి హిందూస్తాన్ టైమ్స్ ఓ టి టి ప్లే 2025 అవార్డు ను అందుకోవటం విశేషం. జీ5లో స్ట్రీమ్ అవుతున్న సూపర్ హిట్ సిరీస్ వికటకవి కి గాను ప్రదీప్ ఈ అవార్డు ను అందుకున్నారు. నిఖిల్ అద్వానీ (ఫ్రీడమ్ అట్ నైట్) తో కలిసి ఉత్తమ దర్శకుడు (వెబ్ సిరీస్) అవార్డును ప్రదీప్ మద్దాలి పంచుకున్నారు. జీ5 మరియు ఓ టి టి ప్లే ప్రీమియంలో ప్రసారం అవుతున్న మోస్ట్ సక్సెస్ ఫుల్ తెలుగు సిరీస్ విక్కటకవి కి ప్రదీప్ మద్దాలికి ఈ అవార్డు లభించింది. 1970ల నాటి కల్పిత గ్రామమైన అమరగిరిలో జరిగిన ‘విక్కటకవి’, జ్ఞాపకాలను చెరిపేసే ప్లేగు వ్యాధి నేపథ్యంలో ఆకట్టుకునే కథ తో ఆద్యంతం ఉత్కంఠ రేపే కథనం తో ఒక గ్రామీణ థ్రిల్లర్ గా ప్రదీప్ రూపొందించిన తీరు వీక్షకుల కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ సిరీస్‌లో నరేష్ అగస్త్య డిటెక్టివ్ రామ కృష్ణ గా నటించారు. మేఘా ఆకాశ్ మరో ప్రధాన పాత్రలో కనిపిస్తారు.
Also Read
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Anand Deverakonda : వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమీ చేయలేక పోయేవాడిని!
- Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
- Shivaji: "ఆ బూతులు అవసరమా అనిపించింది.. ట్రైలర్ చూసి నేనే షాక్ అయ్యా".. 'ఎపిక్' ఈవెంట్లో శివాజీ బోల్డ్ కామెంట్స్!
ప్రదీప్ మద్దాలి ఇంజనీరింగ్, ఐటీ బ్యాక్ గ్రౌండ్ నుండి దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించారు. ’47 డేస్’, ఆధ్యాత్మిక సిరీస్ ‘సర్వం శక్తి మయం’ తో టాలెంటెడ్ దర్శకుడిగా ఓటిటి ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్, ‘వికటకవి’ తో దర్శకుడిగా మరో స్థాయికి వెళ్ళారు. ఈ విజయం ప్రశంసలతో పాటూ ప్రతిష్టాత్మక హిందూస్తాన్ టైమ్స్ ఓటిటి ప్లే అవార్డును సంపాదించిపెట్టింది. షోయబ్ సినిమాటోగ్రఫీ,. రామోజీ ఫిల్మ్ సిటీ మరియు హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుని క్వాలిటీ గ్రాఫిక్స్ తో చిత్రీకరించబడిన ‘విక్కటకవి’ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కిన వెబ్ సిరీస్ గా ప్రశంసలు అందుకుంది. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ప్రదర్శించబడిన మొదటి తెలుగు వెబ్ సిరీస్ వికటకవి కావడం ఈ సిరీస్ సాధించిన విజయాన్ని సూచిస్తుంది.

- Tags
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!