ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే సినిమా రూపొందుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ‘ఫౌజీ’ అనేది వర్కింగ్ టైటిల్‌గా ఉంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ఒక సైనికుడిగా నటిస్తున్నారనే ప్రచారం ఉంది. ఒక లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాని పీరియడ్ సెటప్‌లో రూపొందిస్తున్నారు.
Also Read:Jr NTR: కాలర్ సెంటిమెంట్ తో రెండో దెబ్బ?
ఈ సినిమాకి భారీ బడ్జెట్ కావాల్సి వస్తోంది. దీంతో నిర్మాతలు ఒక ఆసక్తికరమైన ప్రతిపాదన ప్రభాస్ ముందు పెట్టినట్లుగా తెలుస్తోంది. అదేంటంటే, సినిమా మొత్తం పూర్తయ్యే వరకు రెమ్యునరేషన్ ఇవ్వలేమని, సినిమా పూర్తయిన తర్వాత డిజిటల్ రైట్స్ ఎంత వస్తే అంత మీకు ఇస్తామని ప్రభాస్ ముందు ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది. నిర్మాతల మీద భారం పడకుండా ప్రభాస్ కూడా అందుకు ఒప్పుకున్నాడని అంటున్నారు. ప్రస్తుతానికి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి 150 నుంచి 180 కోట్ల వరకు డిజిటల్ రైట్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే, ప్రభాస్ ఈ సినిమాకి 150 నుంచి 180 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకునే అవకాశం ఉంది.
Also Read:NTV Telugu Podcast: నండూరి శ్రీనివాస్ తో ఎన్టీవీ స్పెషల్ పాడ్‌కాస్ట్..
ఒకవేళ 180 కోట్లు ప్రభాస్ అందుకుంటే గనుక, ఆ బడ్జెట్లో 20 చిన్న మలయాళం తరహా సినిమాలు చేసేయొచ్చని అంటున్నారు. మొత్తం మీద ప్రభాస్ రెమ్యునరేషన్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అయితే, ఇలా రెమ్యునరేషన్ కాకుండా రైట్స్ మీద వచ్చే డబ్బులు తీసుకోవడం కొత్తవి కాదు. కొంతమంది హీరోలు కొంత రెమ్యునరేషన్ తీసుకుని, మిగతావి థియేట్రికల్ ఏరియా వారీగా హక్కులు తీసుకునేవారు. ఇప్పుడు ప్రభాస్ డిజిటల్ రైట్స్ తీసుకోవడం గమనార్హం.
