NTV Telugu Site icon

Prabhas: టాలీవుడ్ లో ఒకే ఒక్కడు ఉప్పలపాటి ప్రభాస్..ఇంక ఎవరి వల్ల కాదు..

Untitled Design (23)

Untitled Design (23)

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం “కల్కి 2898 ఎడి”. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇంకా దీపికా పడుకోణ్ అత్యంత కీలక పాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 1100 కోట్లు కలెక్షన్స్ రాబట్టి వరల్డ్  బాక్సాఫీస్ వద్ద రికార్డులమీద రికార్డులు నమోదు చేస్తూ గత చిత్రాలు తాలుకు రికార్డులను బద్దలుకొడుతుంది. ఇప్పటికే RRR, జవాన్ తాలూకు రికార్డులు బద్దలు కొట్టాడు ప్రభాస్.
మరోవైపు ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 5 సినిమాలు ఉన్నాయి. టాలీవుడ్ అందరి హీరోలలో ఇలా 5 సినిమాలు లైన్ లో ఉన్న ఒకే ఒక్కడు ప్రభాస్ మాత్రమే అని చెప్పడంలో మరో మాట లేదు. రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ వరుస సినిమాలు విడుదల చేసిన రెబల్ స్టార్ ఈ ఏడాది కల్కి తో బాక్సాఫీస్ దుమ్ము దులిపాడు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ‘ది రాజాసాబ్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఏప్రిల్ 10 2025న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సెప్టెంబరు నుండి హను రాఘవపూడి చిత్రం స్టార్ట్ చేయనున్నాడు. ఆ వెంటనే సెన్సషల్ చిత్రాలు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ వచ్చే ఏడాది జనవరిలో మొదలుపెట్టనున్నాడు. ఈ మూడు కాకుండా సలార్ -2, కల్కి -2 ఉండనే ఉన్నాయి.  మిగిలిన స్టార్ హీరోలు ఒక సినిమానే రిలీజ్ చేయలేకుంటే ప్రభాస్ ఒకేసారి 5 సినిమాలు లైన్ లో ఉంచి తనకు  తానె పోటీ అని మరోసారి రుజువు చేసాడు.

Also Read :Ustad: డబుల్ ఇస్మార్ట్ ను డబుల్ స్పీడ్ లో ముగించిన రామ్ పోతినేని