Kannappa: ‘కన్నప్ప’ కి ప్రభాస్ పారితోషికం తీసుకోవడం లేదా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా మూవీస్‌లో ‘కన్నప్ప’ ఒకటి. మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ అయిన ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కానుంది. వంద కోట్లకు పైగానే బడ్జెట్ అయ్యిన ఈ డివోషనల్ మల్టీస్టారర్ మూవీలో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, దేవరాజ్, మధుబాల, శరత్ కుమార్, ముఖేష్ ఋషి తదితరలు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. అయితే ఎక్కువగా దృష్టిని ఆకర్షిస్తోంది మాత్రం ప్రభాస్. ఇక రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో టీమ్ ప్రమోషన్స్ వేగం కూడా పెంచింది.
Also Read:Ranbir Kapoor: టాలీవుడ్‌లో మూవీ చేయబోతున్న బాలీవుడ్ స్టార్..!
Also Read
ఇందులో భాగంగా తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం ఏంటీ అంటే ‘కన్నప్ప’ కోసం ప్రభాస్ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదట. కేవలం మంచు కుటుంబం మీద, ముఖ్యంగా మోహన్ బాబు మీద అభిమానంతో ఉచితంగా నటించేశాడు. అయితే నిర్మాతగా ఎంత అడిగినా ఇవ్వడానికి విష్ణు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభాస్ నయా పైసా తీసుకోకపోవడం విశేషం. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు విష్ణు.. ‘ నేను ప్రభాస్ ఇంకా మోహన్ లాల్ ఇద్దరికీ రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధం అయ్యాను. కానీ వాళ్లిద్దరూ ఒక్క రూపాయి కూడా వద్దని తిరస్కరించారు. మోహన్ లాల్ అయితే.. ఏంటి అంత పెద్దవాడివి అయిపోయావా అని అడిగారు. వాళ్లిద్దరూ స్నేహానికి విలువ ఇచ్చే అంత గొప్ప నటులు’ అని మంచు విష్ణు తెలిపారు. ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతుంది.
తాజావార్తలు
-
PM Kisan: రైతులకు శుభవార్త.. అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు వచ్చేశాయ్.. చెక్ చేసుకోండిలా..
-
Crispy Ridge Gourd Tikki Recipe: బీరకాయతో సూపర్ స్నాక్.. కరకరలాడే టిక్కీలు ఇలా తయారు చేయండి
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
IND Vs AFG: భారత బౌలర్ల ధాటికి ఆఫ్ఘనిస్థాన్ విలవిల.. టార్గెట్ 219 పరుగులు..
-
Donald Trump: నేను లేకుంటే ఇజ్రాయిల్ నాశనమయ్యేదే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!