Site icon NTV Telugu

Spirit: బాక్సాఫీస్ బాడీ పల్స్ తెలిసినోడు వచ్చేశాడు

Prabhas

Prabhas

ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇంకా షూటింగ్ ప్రారంభం కానీ ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమా షూటింగ్ ఒక ఫైట్ సీక్వెన్స్‌తో ప్రారంభించబోతున్నారట. ఆ ఫైట్ సీక్వెన్స్ కూడా ప్రభాస్ బాడీ లాంగ్వేజ్‌కి బాగా అలవాటు పడిన పీటర్ హెయిన్స్ చేత చేయించబోతున్నట్లుగా తెలుస్తోంది.

Also Read :Nagarjuna: నాగార్జునపై వ్యాఖ్యలకి చింతిస్తున్నా.. మంత్రి కొండా సురేఖ ట్వీట్‌

ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో వచ్చే ఈ ఫైట్ సినిమా మొత్తానికే ఒక హైలైట్ అని అంటున్నారు. ఇక, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా నటిస్తున్నట్లు తాజాగా ప్రచారం మొదలైంది. ఒకవేళ అది కనుక నిజమైతే మాత్రం, బాక్సాఫీసులు బద్దలై పోవడం ఖాయం అని చెప్పాలి. ఇక ఈ సినిమాని టి సిరీస్ సంస్థతో కలిసి సందీప్ రెడ్డి వంగా తన సొంత భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. సందీప్ రెడ్డి సోదరుడు ప్రణయ్ రెడ్డి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించబోతున్నారు.

Also Read :Actor Govinda: ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు..

నిజానికి, సందీప్ రెడ్డి వంగా – ప్రభాస్ కాంబినేషన్ సినిమా అన్నప్పటినుంచి సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలు మరింత పెంచేలా ఈ సినిమా అప్‌డేట్స్ అయితే ఉంటున్నాయి. మొత్తం మీద, ప్రభాస్ బాడీ కటౌట్‌కి తగ్గట్టుగా, ఆయనకు అలవాటైన పీటర్ హెయిన్స్ అయితే ఫైట్స్ నెక్స్ట్ లెవెల్‌లో వస్తాయి అని భావిస్తున్నారట. పీటర్ హెయిన్స్ ఇప్పటికే ప్రభాస్‌తో బాహుబలి, కల్కి లాంటి సినిమాలు చేశారు. మధ్యలో చాలా సినిమాలకు కూడా వీరిద్దరూ కలిసి పనిచేశారు.

Exit mobile version