ప్రభాస్ అభిమానులకు, సినీ ప్రేక్షకులకు ఒక ఆసక్తికరమైన వార్త తెర మీదకు వచ్చింది. ‘రాజా సాబ్’ సినిమా విడుదలకు ముందు చిత్ర యూనిట్ మరో ట్రైలర్‌ను విడుదల చేయాలని యోచిస్తోంది. అయితే, ఈసారి ట్రైలర్ విషయంలో దర్శకుడు మారుతి ఒక సరికొత్త పద్ధతిని అనుసరించబోతున్నారు. సాధారణంగా సినిమాలలోని కీ షాట్స్‌తో ట్రైలర్ కట్ చేస్తుంటారు. కానీ, ‘రాజా సాబ్’ కోసం విడుదల చేయబోయే ఈ రెండో ట్రైలర్‌ను సినిమాలోని సన్నివేశాలతో కాకుండా, దీనికోసం స్పెషల్‌గా షూట్ చేయాలని దర్శకుడు మారుతి భావిస్తున్నారు.
Also Read :Lokesh Kanagaraj : అనుమానాలు లేవ్.. లోకేష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఫిక్స్
ఈ స్పెషల్ వీడియో ప్రమోషనల్ వీడియోలా ఉంటూనే, పూర్తిస్థాయి ట్రైలర్ అంత ఎఫెక్ట్‌ను కలిగించేలా డిజైన్ చేయబోతున్నారు. ఓ రకంగా చూస్తే, సినిమా ప్రమోషన్స్‌లో ‘రాజా సాబ్’ తో ఒక కొత్త ట్రెండ్ మొదలు కావచ్చు. అయితే ఇది పూర్తిగా కొత్త స్ట్రాటజీ అని చెప్పలేం. ఎందుకంటే సినిమా మీద ఆసక్తి కలిగించేలా ఉన్నా కొన్ని డైలాగ్స్, షాట్స్ తో చేసిన కొన్ని ట్రైలర్స్ ఇప్పటికే రిలీజ్ చేసి తర్వాత సినిమాలో అవి లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ సినిమా విషయంలో కూడా దాదాపుగా అదే స్ట్రాటజీ ఫాలో అవ్వబోతున్నారు. ఈ వినూత్న ప్రమోషనల్ స్ట్రాటజీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
