టాలీవుడ్ లోనే కాదు మొత్తం ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తం మీద ప్రస్తుతం అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాదే. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన వంగా, ఇప్పుడు స్పిరిట్ సినిమాలో ప్రభాస్‌ను ఎలా చూపిస్తారా అని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నూతన సంవత్సరాది సందర్భంగా సందీప్ రెడ్డి వంగ రిలీజ్ చేసిన ‘స్పిరిట్’ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Also Read: Pralay Missiles: “ప్రళయ్” మిస్సైల్ టెస్ట్ విజయవంతం.. దీని ప్రత్యేకతలు ఇవే..
తాజాగా బయటకు వచ్చిన ఈ ఇంటెన్స్ పోస్టర్‌ను గమనిస్తే, సందీప్ రెడ్డి వంగా మార్క్ రా అండ్ రస్టిక్ స్టైల్ స్పష్టంగా కనిపిస్తోంది. వీపు నిండా గాయాలు, కట్టుకట్టిన చేతులు, ఒంటిపై దెబ్బలు.. ఇవన్నీ చూస్తుంటే సినిమాలో యాక్షన్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్ తన సిగ్నేచర్ స్టైల్‌లో సిగరెట్ నోట్లో పెట్టుకుని కనిపిస్తుండగా కనిపిస్తుండగా, పక్కనే ఉన్న ఫీమేల్ లీడ్ తృప్తి డిమ్రి ఆ సిగరెట్‌ను వెలిగిస్తున్న దృశ్యం మరింత పవర్‌ఫుల్‌గా ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
Also Read:PM Modi: “ప్రగతి” ద్వారా రూ.85 వేల కోట్ల ప్రాజెక్టులు వేగవంతం.. రాష్ట్రాలకు ప్రధాని కీలక సూచనలు
కానీ, ఈ పోస్టర్ చూస్తుంటే అది ఒక సాధారణ పోలీస్ కథ కాదని, తీవ్రమైన ఎమోషన్స్ సహా హింసతో కూడిన “యాంగ్రీ యంగ్ మ్యాన్” కథ అని తెలుస్తోంది. ఈ సినిమాను భూషణ్ కుమార్ సహా సందీప్ రెడ్డి వంగా కు సంబంధించిన భద్రకాళి పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీతో పాటు చైనీస్, జపనీస్ సహా కొరియన్ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుండటం విశేషం. అంటే, ప్రభాస్ ‘స్పిరిట్’ తో గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నారన్నమాట.
గత సినిమాలపరంగా చూసుకుంటే సందీప్ వంగా సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా, వైల్డ్‌గా ఉంటుంది. ప్రభాస్ లాంటి భారీ కటౌట్ ఉన్న హీరోకి వంగా మేకింగ్ తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పోస్టర్ చూసిన తర్వాత “డార్లింగ్” అభిమానులు పండగ చేసుకుంటున్నారు. నిజానికి ప్రభాస్ ఈ చిత్రంలో మొదటిసారిగా ఖాకీ డ్రెస్ వేసుకోబోతుండటం గమనార్హం. ఆయనలోని మాస్ యాంగిల్‌ను వంగా ఏ విధంగా ఎలివేట్ చేస్తారో చూడాలి.
