NTV Telugu Site icon

Rebal Star : ‘కన్నప్ప’లో ప్రభాస్.. ఇది అస్సలు ఊహించలేదుగా

Kannappa (2)

Kannappa (2)

మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ముఖేష్‌కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రీతి ముకుందన్‌ ఫీమెల్ లీడ్‌లో నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో మోహన్ బాబుతో పాటు మలయాళ స్టార్  మోహన్‌లాల్‌, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్‌, కాజల్ అగర్వాల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. శివుడి పాత్రలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్ నటిస్తుండగా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్‌ నంది పాత్రలో కనిపించనున్నాడు.

Also Read : MB Foundation : నమ్రతా శిరోద్కర్ పుట్టినరోజు సందర్భంగా MB ఫౌండేషన్ స్పెషల్ డ్రైవ్

ఇప్పటికే దాదాపుగా అందరి ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేయగా ఆడియెన్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ప్రభాస్ లుక్ ఇంకా రివీల్ చేయలేదు. అయితే  ఈ సినిమాలో ప్రభాస్ కేవలం గెస్ట్ రోల్ మాత్రమే చేస్తున్నాడనే టాక్ ఉంది. కానీ లేటెస్ట్ న్యూస్ మాత్రం అస్సలు ఊహించకుండా ఉందనే చెప్పాలి. కన్నప్పలో ప్రభాస్ పై ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సాంగ్‌ని డాన్స్ మాస్టర్ గణేష్ మాస్టర్ కంపోజ్ చేసినట్టుగా చెబుతున్నారు. దీంతో ఈ సినిమాలో ప్రభాస్ స్క్రీన్ స్పేస్ కాస్త ఎక్కువగానే ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ప్రభాస్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసిన మేకర్స్  ఈ సినిమాకు సంబంధించి ఎక్కువ భాగం న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు. ఈ వేసవి కానుకగా ఏప్రిల్‌ 25న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టిన విష్ణు త్వరలోనే ప్రభాస్‌కు సంబంధించిన స్పెషల్ టీజర్ రిలీజ్ చేయనున్నట్టుగా సమాచారం.