Prabhas Fauzi: డార్లింగ్ ఫ్యాన్స్ ఇక తగ్గేదేలే.. ‘ఫౌజీ’ ప్రమోషన్స్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్!

Prabhas

Prabhas

Prabhas Fauzi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడికల్ వార్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’. ‘సీతారామం’ వంటి క్లాసిక్ లవ్‌స్టోరీని తెరకెక్కించిన హను ఈసారి ప్రభాస్‌తో ఓ భారీ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. అయితే ఇప్పటివరకు ‘ఫౌజీ’ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ చాలా తక్కువగానే ఉంది. మేకర్స్ ఇప్పటి వరకు కేవలం లుక్ పోస్టర్స్‌ను మాత్రమే రిలీజ్ చేశారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ‘ఫౌజీ’ ప్రమోషన్స్‌కు సంబంధించి తాజాగా మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ నెలలోనే ఫౌజీ ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని, కంటెంట్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. అంతేకాదు ‘ఫౌజీ’ నుంచి రిలీజ్ చేయబోయే ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని క్రియేట్ చేసేలా ఉంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభాస్ అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ప్రస్తుతం ‘ఫౌజీ’ షూటింగ్ చివరి దశలో కొనసాగుతోంది. అనుకున్నట్లుగా డిసెంబర్ 3న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మిగిలిన షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసే పనిలో చిత్ర బృందం బిజీగా ఉంది. ఈ పీరియాడికల్ వార్ డ్రామాలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ నెలలో ఫౌజీ ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ డార్లింగ్ ఫ్యాన్స్‌కి ఎలాంటి సర్‌ప్రైజ్‌లు ఇస్తారో చూడాలి.