Site icon NTV Telugu

Prabhas : దసరా బరిలో ప్రభాస్ ‘ఫౌజీ’.. షూటింగ్ పూర్తయ్యే వరకు ఇతర సినిమాలకు నో డేట్స్..

Prabhas

Prabhas

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా క్లాసిక్ చిత్రాల డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఫౌజీ’. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం రిలీజ్ పై సోషల్ మీడియాలో ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని 2026 దసరా కానుకగా విడుదల చేసేందుకు పక్కా ప్లాన్‌తో సిద్ధమవుతున్నారు.

Also Read : Vijay Devarakonda : నితిన్ రిజెక్ట్ చేసిన కథతో విజయ్ దేవరకొండ సినిమా.. టైటిల్ కూడా ఫిక్స్

 అందుకోసం ప్రభాస్ కూడా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు తన డేట్స్‌ని కేవలం ‘ఫౌజీ’ చిత్రానికే ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట. ఈ నేపథ్యంలో స్పిరిట్ షూటింగ్స్‌కు తాత్కాలికంగా విరామం ఇచ్చి, పూర్తి ఫోకస్ మొత్తం హను రాఘవపూడి సినిమాపై ఉంచాలని ఫిక్స్ అయ్యాడట. దాంతో ఈ సినిమా చిత్రీకరణ ఎలాంటి ఆటంకాలు లేకుండా శరవేగంగా చేసేలా ప్లాన్ చేస్తున్నాడు హను. 1940ల నాటి స్వాతంత్ర పోరాట నేపథ్యంతో సాగే ఈ పీరియడ్ డ్రామాలో విజువల్స్ మరియు టెక్నికల్ అంశాలు ప్రేక్షకులను అబ్బురపరిచేలా ఉంటాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా హను రాఘవపూడి తన సినిమాల్లో చూపించే పెయింటింగ్ లాంటి విజువల్స్, ‘ఫౌజీ’లో మరిన్ని హంగులతో కనువిందు చేయనున్నాయి. భారీ సెట్టింగులు, యుద్ధ సన్నివేశాలు మరియు అప్పటి కాలం నాటి వాతావరణాన్ని రీ-క్రియేట్ చేసేందుకు మేకర్స్ ఏమాత్రం రాజీ పడటం లేదు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తోంది. పవర్‌ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తోరూపొందుతున్న ఫౌజీతో ప్రభాస్ సాలిడ్ హిట్ కొడతాడని ఫాన్స్ ధీమాగా ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కు ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఉన్నారు.

Exit mobile version