టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రెండు భారీ చిత్రాలలో నటిస్తున్నాడు. దర్శకుడు మారుతి రూపొందిస్తున్న “రాజా సాబ్”, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఫౌజీ”(రూమర్డ్) అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తున్నాయి. ఈ రెండు సినిమాలు భిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న “ఫౌజీ” ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎమోషనల్ లవ్ స్టోరీని ప్రధామైన ప్లాట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం ఫౌజీ షూటింగ్ 50 శాతం పూర్తయింది.
Also Read : Mahesh Babu : 50 ఏళ్ల రాజకుమారుడు
ప్రభాస్ తన బల్క్ డేట్స్ కేటాయించడంతో, రాబోయే రెండు నెలల్లో ఈ చిత్రం షూటింగ్ పూర్తవుతుందని అంటున్నారు. ఇక షూటింగ్ కొలిక్కి రావడంతో మేకర్స్ ఈ సినిమాని 2026 ఏప్రిల్ 3న, గుడ్ ఫ్రైడే వీకెండ్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. నిజాయికి “ఫౌజీ”ని రికార్డు బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసమే భారీ సెట్‌లను సిద్ధం చేశారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకి భారీ బడ్జెట్ కేటాయించారు. హను రాఘవపూడి పోస్ట్ ప్రొడక్షన్‌లో ఎక్కువ సమయం అవసరమని భావిస్తున్నారు కాబట్టి, షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్. ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తున్నారు.
