ప్రభాస్ చేస్తున్న అన్ని సినిమాలలో ఆయన అభిమానులు ఎక్కువగా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది ఫౌజీ. నిజానికి ఈ సినిమాకి ఫౌజీ అనే పేరు ఇంకా ఫిక్స్ చేయలేదు. హను రాఘవపూడి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా సెట్స్‌లో తాజాగా ప్రభాస్ జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఒక లీకైన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ALso Read:Kannappa: ఇండస్ట్రీ హిట్ ‘రికార్డ్’?
అయితే అది నిజంగానే సినిమా సెట్స్ నుంచి లీకైన పిక్ లేక అత్యుత్సాహంతో ఎవరైనా ఫ్యాన్స్ క్రియేట్ చేశారా అనే విషయం మీద క్లారిటీ లేదు. హను రాఘవపూడి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా కోసం కేవలం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు, యావత్ ప్రేక్షకులు అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఎలాంటి సందేహం లేదు.
ALso Read: ZEE5 vs Etv Win : వాళ్లే తొందరపడ్డారు.. అంతా కోర్టు చూసుకుంటుంది!
నిజానికి కొన్నాళ్లపాటు రెస్ట్ మోడ్‌లోకి వెళ్లిన ప్రభాస్ ఇటలీలో ఒక గ్రామంలో కొన్నాళ్లపాటు రెస్ట్ తీసుకున్నారు. తర్వాత హైదరాబాద్ వచ్చిన ఆయన ఫస్ట్ ప్రయారిటీ ఈ సినిమా షూటింగ్‌కే ఇచ్చినట్లుగా చెబుతున్నారు సన్నిహితులు. మొత్తం మీద ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రభాస్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
