Maruthi: ‘రాజాసాబ్’ గాయం ఇంకా మానలేదా? మారుతిని ఆడుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్!

Maruthi Comments

Maruthi Comments

Maruthi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖుల నుంచి మొదలుకొని అభిమానుల వరకు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు. అయితే ఇదే టైంలో దర్శకుడు మారుతి చేసిన ఒక పోస్ట్ మాత్రం నెట్టింట అనూహ్య రచ్చకు దారితీసింది. ప్రభాస్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ మారుతి పెట్టిన పోస్ట్‌పై కొందరు ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. ప్రభాస్‌ను తన గురువుగా, మార్గదర్శిగా అభివర్ణిస్తూ.. ఆయన వినయం, కష్టపడే గుణం ఎందరికో ఆదర్శమని మారుతి ఆకాశానికెత్తేశారు. ఎప్పటికీ ప్రభాస్‌కు అండగా ఉంటానని చెప్పుకొచ్చారు. అయితే ఈ పోస్ట్‌ను చూసి ప్రభాస్ అభిమానులు ఏమాత్రం కరగకపోగా, పాత గాయాలను గుర్తుచేసుకుంటూ మారుతిని దారుణంగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు.

గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘ది రాజాసాబ్’ సినిమా రిజల్ట్‌పై ఫ్యాన్స్ ఇప్పటికీ ఎంతటి అసంతృప్తితో ఉన్నారో ఈ కామెంట్లను చూస్తే అర్థమవుతోంది. సినిమా విడుదలకు ముందు ప్రమోషన్లలో భారీ హైప్ ఇచ్చి, తీరా థియేటర్లలోకి వచ్చాక ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడాన్ని నెటిజన్లు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ చేదు అనుభవాన్ని ప్రస్తావిస్తూ.. “మళ్లీ ప్రభాస్‌తో సినిమా అవకాశం దక్కించుకోవడానికేనా ఈ రేంజ్ పొగడ్తలు?” అంటూ సెటైర్లు విసురుతున్నారు. ఏదేమైనా ‘ది రాజాసాబ్’ ఇచ్చిన షాక్ నుంచి ప్రభాస్ అభిమానులు ఇంకా పూర్తిగా తేరుకోలేదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.