NTV Telugu Site icon

Prabhas : సోషల్ మీడియని షేక్ చేస్తున్న డాన్ లీ ఇన్‌స్టా పోస్ట్

Don Lee

Don Lee

టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. మరోవైపు దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ‘ఫౌజీ’ సినిమా కూడా స్టార్ట్ చేశాడు. ఇక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమాను కూడా లైన్‌లో పెట్టాడు.

Also Read : Kollywood : సీనియర్ నటుడు ఢిల్లీ గణేష్ మృతి

కాగా ఈ ‘స్పిరిట్’ సినిమాకు సంభందించిన వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వివరాలలోకెళితే కొరియన్ సినిమా అంటే ముందుగా గుర్తొచ్చే నటుడు యాక్టర్ డాన్ లీ. ఈయన సినిమాల్లోని యాక్షన్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కాగా ఎప్పటి నుండో డాన్ లీ ని ప్రభాస్ సినిమాలో తీసుకోవాలి అని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కానీ అవి వార్తలుగా మిగిలిపోయాయి తప్ప కార్యరూపం దాల్చలేదు. అయితే తాజాగా డాన్ లీ తన ఇన్‌స్టాగ్రామ్ లో ‘సలార్-2’ పోస్టర్ లోని ప్రభాస్ ఫోటోను జత చేస్తూ స్టోరీ పెట్టాడు. డాన్ లీ అలా పెట్టాడో లేదో ఇలా ఆ న్యూస్ ఒక్కసారిగా నెట్టింట హల్ చల్ చేసింది. కానీ ఇక్కడ క్లారిటీ రావాల్సిన విషయం ఉంది. డాన్ లి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ -2 లో చేస్తున్నాడా లేక స్పిరిట్ లో నటిస్తున్నాడా అనేది ఎటువంటి అధికారక ప్రకటన రాలేదు. ప్రభాస్ – డాన్ లీ ఏ సినిమాలో నటించిన సరే వీరిద్దరి కాంబోకు బాక్సాఫీస్ బద్దలు అవడం మాత్రం ఖాయం

Show comments