NTV Telugu Site icon

Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. స్పిరిట్ మెుదలెట్టారు..

Apirit

Apirit

సందీప్ రెడ్డి వంగా తోలి సినిమాతో అర్జున్ రెడ్డితో సెన్సేషనల్ హిట్ కొట్టి సెన్సేషన్ క్రియేట్ చేసాడు. అదే సినిమాను హిందీలో తెరకెక్కించి బి టౌన్ సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఆ తర్వాత బాలీవుడ్ ప్రిన్స్ రన్ బీర్ కపూర్ తో తెరకెక్కించిన యానిమల్ సినిమాతో ఖాన్ ల రికార్డులు బద్దలు కొట్టాడు. ఇక సందీప్ తరువాతి సినిమా ఎవరితో చేస్తాడు అనే తరుణంలో తన తర్వాతి సినిమాను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రకటించాడు సందీప్ రెడ్డి.

Also Read : Manchu Vishnu : కన్నప్ప విడుదలపై క్లారిటీ లేదప్ప..

అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి ప్రభాస్ తో తెరకెక్కించే సినిమాను తన గత సినిమాల కంటే ఇంకాస్త ఎక్కువ వైలెంట్ గా తీసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. తాజాగా స్పిరిట్ సినిమాకు సంబంధించిన వర్క్ మొదలు పెట్టాడు సందీప్. రెబల్ స్టార్ తో తెరకెక్కించే ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. దీపావళి కానుకగా మ్యూజిక్ డైరెక్టర్ తో కలిసి స్పిరిట్ సినిమా సంగీత పనులు స్టార్ట్ చేసాడు. అందుకు సంబంధించి స్పెషల్ వీడియోను సోహాల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ప్రభాస్ తో చేయబోయే సినిమా ఎవరికీ తలవంచని ఒక డేషింగ్ డాషింగ్ పోలీస్ స్టోరీ అని ఆ మధ్య ఒక సినిమా వేదికపై సందీప్ ప్రకటించాడు. మరోవైపు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాదిలో స్పిరిట్ షూటింగ్ మొదలు పెట్టనున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ప్రభాస్ కెరియర్ లో మునుపెన్నడు చూడని విధంగా వైల్డ్ గా స్పిరిట్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

Show comments