NTV Telugu Site icon

Prabhas: ఢిల్లీ ఎర్రకోటలో రావణ దహనం.. హాజరుకానున్న హీరో ప్రభాస్

Prabhas

Prabhas

Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు అరుదైన గౌరవం లభించింది. ఢిల్లీ ఎర్రకోటలోని రాంలీలా మైదానంలో వేడుకగా జరుగనున్న రావణదహన కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఆహ్వానం అందింది. ఈ మేరకు ప్రభాస్ కు విజయదశమి ఉత్సవాలు నిర్వహిస్తున్న లవకుశ రామ్ లీలా కమిటీ ఆహ్వానం పంపింది. గడిచిన రెండేళ్ల కాలంలో కరోనా వల్ల ఉత్సవాలను నిర్వహించలేకపోయిన నిర్వహకులు…ఈ సారి భారీ ఎత్తున్న ప్రణాళికలు రచించింది. విజయదశమి పండుగను పురస్కరించుకొని ఎర్రకోటలో అయోధ్యలోని రామాలయం నిర్మాణంలోని పండల్‌ను వేదికగా తీర్చిదిద్దారు. రావణ దహన కార్యక్రమానికి పాన్ ఇండియా హీరో ప్రభాస్ పాల్గొననున్నారు. ఈయనతో పాటుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో రావాణసురుడు, కుంభకర్ణుడు, మేఘనాధ్‌ల బొమ్మలను ప్రభాస్‌ దహనం చేయనున్నారు.

క‌రోనా కార‌ణంగా రెండేళ్లుగా రాంలీలా మైదానంలో రావ‌ణ ద‌హ‌న కార్యక్రమం జ‌ర‌గ‌లేదు. క‌రోనా విస్తృతి భారీగా త‌గ్గిపోయిన నేప‌థ్యంలో ఈ ఏడాది రావ‌ణ ద‌హ‌న వేడుక‌ను గ్రాండ్ గా నిర్వహించాలని రామ్ లీలా కమిటీ తీర్మానించింది. ప్రస్తుతం బాలీవుడ్ ద‌ర్శకుడు ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమాలో రాముడిగా ప్రభాస్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్రభాస్ కు అందిన ఆహ్వానం మేరకు రాంలీలా మైదానంలో రావ‌ణ ద‌హ‌న కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఉత్తరప్రదేశ్‎లోని అయోధ్యలో ఉన్న ప్రభాస్ ఢిల్లీకి చేరుకున్నారు.

Read Also: PM Narendra Modi: జెలెన్‌స్కీకి ఫోన్.. సైనిక చర్యతో సంక్షోభాన్ని పరిష్కలేరంటూ సూచన

అయితే ఆదిపురుష్ చిత్రంపై రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్ పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. అందులో రావణ, హనుమాన్ పాత్రలు కనిపించిన తీరుపై చాలామంతి తప్పుపడుతున్నారు. రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ మిలిటరీ క్రాఫుతో, పొడవైన గడ్డంతో విచిత్రంగా కనిపించడాన్ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. హనుమంతుడు కూడా ఇంగ్లీషు సినిమాల్లో కింగ్ కాంగ్ లా ఉన్నాడని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అంశంపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తీవ్రస్థాయిలో స్పందించారు. ఆదిపురుష్ చిత్రంలో హనుమంతుడి వేషధారణ అభ్యంతరకరంగా ఉందని ఆరోపించారు. తోలు పట్టీలతో కూడిన దుస్తుల్లో హనుమంతుడి వేషధారణ సరికాదని అన్నారు. అభ్యంతరకర సన్నివేశాలు తొలగించకపోతే ఆదిపురుష్ నిర్మాతలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి హెచ్చరించారు.

Show comments