NTV Telugu Site icon

Pottel : రివ్యూ రైటర్స్ పై శ్రీకాంత్ అయ్యంగార్ దారుణ వ్యాఖ్యలు

Sriknth

Sriknth

శ్రీకాంత్ అయ్యంగర్. క్యారెక్టర్​ ఆర్టిస్ట్​గా తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొన్నేళ్లుగా తెలుగులో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు అయిపోయారు. ఇటీవల కాలంలో రిలీజ్ అయిన ప్రతి సినిమాలలో శ్రీకాంత్ అయ్యంగర్ పక్కాగా ఉండాల్సిందే. బ్రోచేవారుఎవరుర, ‘సామజవరగమన’, భలే ఉన్నాడే. రీసెంట్ గా వచ్చిన సరిపోదా శనివారం, తాజాగా విడుదలైన పొట్టెల్ సినిమాలోను నటించి మెప్పించారు శ్రీకాంత్ అయ్యంగర్. ఇందులో భాగంగా పొట్టెల్ సక్సెస్ మీట్ సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్.

Also Read : Sai pallavi : అనుకోని వివాదంలో సాయిపల్లలి.. వీడియో వైరల్

ఈ సక్సెస్ మీట్ లో శ్రీకాంత్ అయ్యంగర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆయన మాట్లాడుతూ ” ప్రమోషన్స్ అప్పుడు ఎక్కువ రాలేకపోయాను క్షమించాలి. పత్రికా విలేకరులు మీడియా ప్రతినిధులు అందరూ వచ్చి కోఆపరేట్ చేసి సినిమాని బాగా ముందుకు తీసుకెళ్లారు.దరిద్రానికి విరోచనాలు వస్తే రివ్యూ రైటర్లు పుడతారంట. క్రిములు దొడ్డి నాకెటోళ్లు ఈ రివ్యూ రైటర్స్. మనమందరం కలిసి ఈ చీడపురుగులను ఆపేయాలి. సినిమా డ్రాగ్ ఉందని రాసారు, అసలు జీవితంలో షార్ట్ ఫిల్మ్ తీయడం చేతకాని నా కొడుకులు కూడా రివ్యూ రాస్తున్నారు. సినిమా తీయడం ఎంత కష్టమో రఫ్ ఐడియా లేని నా కొడుకులు వాళ్ళు. ప్రజలు ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు. వాళ్లకి నచ్చితే వాళ్ళే ఈ సినిమాను ముందుకు తీసుకువెళ్తారు. ఈ పొట్టెల్ సినిమా సూపర్ హిట్. దర్శకుడు సినిమాను అద్భుతంగా తీసాడు” అని అన్నారు. శ్రీకాంత్ అయ్యంగర్ గతంలో బెదురులంక, నచ్చింది గర్ల్ ఫ్రెండ్ సినిమాల టైమ్ లోను ఇలాంటి వ్యాఖ్యలే చేసారు

Show comments