తెలుగు సినిమా పరిశ్రమలో రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి పోసాని కృష్ణమురళి. 100కు పైగా చిత్రాలకు కథా రచయితగా, సంభాషణల రచయితగా వ్యవహరించి, గతంలో ‘ఆపరేషన్ దుర్యోధన’ వంటి శక్తివంతమైన చిత్రానికి దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు, కొంత విరామం తర్వాత, మరోసారి దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకోబోతున్నారు పోసాని. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, పోసాని కృష్ణమురళి కొత్త చిత్రంతో రంగంలోకి దిగుతున్నారు.
Also Read:Jyothi Krishna: క్రిష్ కథ అందుకే మార్చేశా.. అదే కిక్కిచ్చింది!
ఈ సినిమాకు ‘అరుణారెడ్డి’ లేదా ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. పోసాని కృష్ణమురళి గతంలో దర్శకత్వం వహించిన చిత్రాలు వాణిజ్యపరంగా విజయం సాధించడమే కాకుండా, విమర్శకుల నుంచి కూడా మంచి ఆదరణ పొందాయి. 2007లో విడుదలైన ‘ఆపరేషన్ దుర్యోధన’ సినిమా, రాజకీయ నేపథ్యంలో సామాజిక సమస్యలను తెరపైకి తీసుకొచ్చి, ప్రేక్షకులతో పాటు విమర్శకులను కూడా ఆలోచింపజేసింది. ఆయన కొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా ఒసేయ్ రాములమ్మ తరహాలోనే ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో పోసాని హీరోగా, విలన్ గా నటించనున్నారు. పోసాని మార్క్‌లో సామాజిక సమస్యలతో కూడిన శక్తివంతమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని టాక్.
