విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కింగ్డమ్. జెర్సీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి కింగ్డమ్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. గత రాత్రి ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ తిరుపతిలో భారీ ఎత్తున నిర్వహించారు. ఈ వేడుకకు విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్ తో పాటు యూనిట్ మొత్తం హాజరైంది. విచేసిన అశేషమైన ఆడియెన్స్ మధ్య కింగ్డమ్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు.
ట్రైలర్ లాంఛ్ కార్యక్రమానికి తిరుపతి విచ్చేసిన విజయ్ దేవరకొండ ఈ ఉదయం తిరుమల కొండకు చేరుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో హీరోయిన్ భాగ్యశ్రీతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను విజయ్ కు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘ కింగ్డమ్ సినిమా రిలీజ్ కు ముందు స్వామి వారి దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన చల్లని దీవెనలు అందరికి ఉండాలి. ఆయన ఆసిస్సులతో మా సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆ స్వామి వారి సన్నిధిలో మా సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ చేసుకోవం సంతోషం’ అని అన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కింగ్డమ్ ఈ నెల 31న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో అడుగుపెడుతోంది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లోప్స్ తో ఇబ్బంది పడుతున్న విజయ్ దేవరకొండ రాబోతున్న కింగ్డమ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి విజయ్ దేవరకొండ ఆశ నెరవేరుతుందో లేదో మరోకొద్దీ రోజుల్లో తెలుస్తుంది.