Site icon NTV Telugu

Poonam Kaur: వదల బొమ్మాళీ.. త్రివిక్రమ్ పై పూనమ్ ట్వీట్!!

Trivikram Poonam Ntv

Trivikram Poonam Ntv

Poonam Kaur Targets Trivikram Again: యూట్యూబర్, నటుడు ప్రణీత్ హనుమంతు వ్యవహారం అనేక సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ విషయం మీద పలువురు సినీ హీరోలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముందుగా సాయిధరమ్ తేజ్ ఈ విషయాన్ని మొట్టమొదటిసారిగా సోషల్ మీడియా వేదికగా అందరికీ అర్థమయ్యేలా వెల్లడించడమే కాదు చర్యలు తీసుకోవాల్సిందిగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం వంటి వాళ్ళు స్పందిస్తూ చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అయితే ఈ మధ్యలో కొందరు ఎప్పుడో జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ పలికిన ఒక డైలాగుని ఇప్పుడు తెరమీదకు తీసుకొస్తున్నారు.

Raj Tarun Case : చిక్కుల్లో రాజ్ తరుణ్.. కేసు నమోదు

అందులో బ్రహ్మానందంతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పడుకున్న అమ్మాయిని రేప్ చేయడం కంటే పరిగెడుతూ అరుస్తున్న అమ్మాయిని రేప్ చేస్తే నీకు ఎక్కువ వస్తుంది అని అర్థం వచ్చేలా డైలాగులు చెబుతాడు. ఈ క్రమంలో ముందు ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఒక నెటిజన్ ట్వీట్ చేయగా దానికి పూనం కౌర్ స్పందించింది. ఈ డైలాగులు త్రివిక్రమ్ రాశాడు అలాంటి వ్యక్తి నుంచి ఇంతకన్నా మంచి డైలాగ్స్ మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటూ ఆమె కామెంట్ చేసింది. గతంలో చాలాసార్లు త్రివిక్రమ్ని పూనం ప్రత్యక్షంగా పరోక్షంగా టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరొకసారి త్రివిక్రమ్ పేరు ప్రస్తావిస్తూ ఆమె ఈ మేరకు వ్యాఖ్యానించడం గమనార్హం.

Exit mobile version