Site icon NTV Telugu

Pooja Hegde : విజయం కోసం కాస్త ఓపిక పట్టాలి..

Pooja Hegde

Pooja Hegde

ఇండస్ట్రీ‌లో హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్‌ల కెరీర్‌ కాలం తక్కువగా ఉంటుంది. ఒకవేళ వరుసగా ఫ్లాఫులు పలకరిస్తే కనుక కథానాయికల కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రజంట్ ఇలాంటి సరిస్థితిలోనే ఉంది పూజా హెగ్డే. గత మూడేళ్లుగా ఈ భామకు ఒక్క హిట్‌ కూడా దక్కలేదు. ఇటీవల వచ్చిన ‘రెట్రో’ సైతం డిజాస్టర్‌గా నిలిచింది. వరుస ఫ్లాఫ్‌లు పడుతున్న కూడా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసాన్ని కనబరుస్తున్న పూజాహెగ్డే.. తాజాగా ‘ కెరీర్‌లో ఇదొక బ్యాడ్‌ఫేజ్‌, కాస్త ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయని విశ్వాసంతో ఉన్నాను. జీవితం సాఫీగా సాగితే అది జీవితం ఎందుకు అవుతుంది. కానీ బాధగా ఉన్న కొన్ని తట్టుకోవాలి తప్పదు’ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఉన్నవన్నీ భారీ చిత్రాలే.

Also Read: Coolie : తెలుగు రాష్ట్రాల్లో ‘కూలీ’ రైట్స్ కోసం భారీ డిమాండ్..!

కోలివెడ్ స్టార్ హీరో రజనీకాంత్‌ ‘కూలీ’లో అతిథి పాత్రలో కనిపించనుంది. అలాగే దళపతి విజయ్‌తో కలిసి ‘జన నాయగన్‌’ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న ఈ అమ్మడు.. దీనితో పాటు తమిళంలో  ‘కాంచన-4’లో నాయికగా నటిస్తున్నది. ఆ ప్రాజెక్ట్‌పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. మరి ఈ సినిమాలతో అయిన పూజ కెరీర్‌ గాడిలో పడుతుందేమో చూడాలి..

Exit mobile version