ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న “బీస్ట్” బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తలపతి విజయ్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “బీస్ట్” చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రంలో విజయ్ సరసన పూజాహెగ్డే రొమాన్స్ చేయనుంది. ఫస్ట్ షెడ్యూల్ కోసం ఇటీవల చెన్నైలో సందడి చేసిన పూజా తాజాగా తిరిగి ముంబై చేరుకుందని తెలుస్తోంది. “బీస్ట్” ఫస్ట్ షెడ్యూల్ లో పూజాహెగ్డే తనవంతు షూటింగ్ ను పూర్తి చేసుకుంది. త్వరలో ప్రారంభం కానున్న రెండవ షెడ్యూల్ లో పూజా పాల్గొననుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఇందులో దర్శకుడు హీరోకు సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
Read Also : రాజమౌళి చేతుల మీదుగా “ఛత్రపతి” హిందీ రీమేక్ లాంచ్
Also Read
ఇప్పటివరకు చెన్నైలో జరిగిన షెడ్యూల్ లో దర్శకుడు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను, ఒక పాటను హీరోహీరోయిన్లపై చిత్రీకరించారు. కాగా ఇటీవల చిత్రం నుంచి విడుదలైన “బీస్ట్” ఫస్ట్ లుక్ పోస్టర్లకు అద్భుతమైన స్పందన వచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 న థర్డ్ లుక్ విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. “తుపాకీ” లాగే ఈ చిత్రం కూడా దేశభక్తి భావోద్వేగం గల నేపథ్యంతో రూపొందుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
- Tags
తాజావార్తలు
-
Real Estate Boom: రియల్ ఎస్టేట్కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
-
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
-
CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్పోర్టులో అవమానం..
-
Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్తో 130 కి.మీ. రేంజ్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..