బింబిసారతో కళ్యాణ్ రామ్‌కు మాసివ్ హిట్ ఇచ్చిన వశిష్టకు మెగాస్టార్ చిరంజీవి పిలిచి ఛాన్స్ ఇచ్చాడు. కానీ విశ్వంభర టీజర్ ఫ్యాన్స్ అంచనాలను అందుకోవడంలో తడబడింది. పూర్ వీఎఫ్ఎక్స్కు తోడు రిలీజ్ చేసిన ఒక్క సాంగ్ కూడా మెప్పించలేకపోయింది. అలాగే రిలీజ్ వాయిదా ఓటీటీ డీల్ సెట్ కాలేదన్న టాపిక్ కూడా విశ్వంభరపై బజ్ తగ్గించేసింది. దీని కన్నా వెనక స్టార్ట్ చేసిన మెగాస్టార్ 157 దూసుకెళుతోంది. విశ్వంభర రిలీజ్ డేట్ ఎప్పుడు అంటూ టీం కూడా చెప్పలేని పరిస్థితి.
Also Read : Prabhas : బాహుబలి @ 10 ఇయర్స్.. ఫ్లాప్ అవ్వాలని కోరుకున్న ప్రముఖులు
మెగా 157 ముందు విశ్వంభరకు ఉన్న బజ్ తేలిపోతుండటంతో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్‌ను రంగంలోకి దింపింది టీం. గోదారి గట్టుమీద రామచిలుకవే అంటూ అందర్ని ఉర్రూతలూగించిన భీమ్స్.. మరోసారి చిరంజీవి కోసం మాస్ మసాలాను రెడీ చేస్తన్నాడట. అది కూడా రీమిక్స్ అన్న టాక్ నడుస్తోంది. విశ్వంభరకు కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ ఓ పెప్ సాంగ్ కంపోజ్ చేస్తున్నాడట బలగం మ్యూజిక్ డైరెక్టర్. మెగా 157కి బాణీలు సమకూర్చే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన భీమ్స్.. విశ్వంభరలో ఐటం సాంగ్ బాధ్యతను తీసుకున్నాడట. చిరంజీవి క్లాసిక్ పెప్ సాంగ్, అన్నయ్య మూవీలోని ఆట కావాలా, పాట కావాలా సాంగ్‌ను రీమిక్స్ చేయబోతున్నాడని టాక్. అందులో సిమ్రాన్ నర్తిస్తే.. ఇప్పుడు బాలీవుడ్ ముద్దుగుమ్మ మౌనిరాయ్ స్టెప్పులు వేయబోతుందట. ఇదే నిజమైతే.. ఇప్పటి వరకు తన పాటలు ఇతరులు రీమిక్స్ చేస్తే.. ఫస్ట్ టైం మెగాస్టారే రీమిక్స్ చేసుకుంటున్నట్లు అవుతుంది. మొత్తానికి ఈ పెప్ సాంగ్తోనైనా సినిమాకు ఓ ఊపు వస్తుందని ఆశిస్తోంది టీం. ఇక రిలీజ్ డేట్ కూడా చిరు బర్త్ డే కన్నా ముందుగా వచ్చే ఛాన్స్ ఉందని టాక్. భీమ్స్ ఈ పాటకు ఎంత న్యాయం చేస్తాడో చూడాలి.